Logo
Date of Publish : 08 September 2023, 9:10 pm
Editor : Sake Naresh

పాడేరులో మన పంచాయితి మన బాధ్యతలు

          పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ నిర్వహించే మన పంచాయితి మన బాధ్యతలలో భాగంగా ఇవాళ మొదటి సారిగా అల్లూరీ జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా ముందుగా జి.మాడుగుల మండలం బీరం పంచాయితి, బోయేతెలి పంచాయితి ల నుంచి పలు సమస్యలపై స్థానిక నాయకులు జనసేనపార్టీ ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నియోజకవర్గాల వారిగా పలుపంచాయితిలలో సమస్యలపై వాటి మూలాలపై స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకు వస్తే వాటిపై సర్చించడానికి తద్వారా పరిస్కారం కొరకు తగిన ఆలోచన చేస్తామని వారాహి యాత్ర సెస్సన్స్ లో గిరిజన పంచాయితిల దుస్థితిపై తగిన కార్యాచరణ స్థానిక నాయకులు చేయాల్సి ఉంటుందని గంగులయ్య గారన్నారు ఈ విషయమై మొదటిసారిగా బీరం, బోయేతెలి పంచాయితీలు పలు సమస్యలపై నిర్ణయాత్మకమైన చర్చ జరిగిందని ఇకపై ప్రతి శుక్రవారం జనసేనపార్టీ మన పంచాయితి మన సమస్యలు అనే అంశాలపై స్థానిక పంచాయితి నాయకులతో సమావేశం ఉంటుందని, జనసేనపార్టీ నాయకులు కచ్చితంగా సమస్యలు, వాటి మూలాలపై గిరిజన ప్రజలకు వాస్తవికతతో కూడిన అవగాహన కల్పిస్తునే వారికి చైతన్యం కలిగించాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా జనసేనపార్టీ గెలిచే విధంగా ప్రజాదరణ లభిస్తుందని గిరిజన రాజకీయాలపై మార్పు ప్రభావం కనిపిస్తుందని ఇంకా వేగంగా జనసేన బలం పుంజుకుంటుందన్నారు. పార్టీ ఆశయాలు, లక్ష్యాలపై నిర్విరామంగా కృషి చేస్తున్న ఆదివాసీ విద్యాధికులే మనకు ప్రధాన బలమని ఆ దిశగా ఆలోచన చేసి అభ్యుదయబావలున్నా యువకులు స్వచ్ఛందంగా తమవంతు సమయం పార్టీ కోసం వెచ్చించడం హర్చించదగ్గవిషయమని అన్నారు. ఈ సందర్బంగా బీరం పంచాయితి నాయకులు, బట్టి అంగధర్, కొర్ర రవి, కొర్ర సింహాద్రి, బోయేతెలి పంచాయితి జి.మాడుగుల మండల గౌరవ అధ్యక్షులు తెరవాడ వెంకట రమణ, నుర్మతి పంచాయితి నాయకులు తల్లే త్రిమూర్తి, తల్లే కృష్ణ, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, సోషల్ మీడియా మరియు ఐటి టీమ్ అధ్యక్షులు అశోక్, సత్యనారాయణ, సిరగం శోభన్, తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com