నర్సీపట్నం ( జనస్వరం ) : నియోజకవర్గం గోలుగుండ మండలంలో రాజుపేట, జిలేడుపూడి గ్రామంలో ” నా సేన కోసం… నా వంతు” కార్యక్రమంలో భాగంగా అక్కడ జనసైనికులతో కలిసి అక్కడ ప్రజలకు పార్టీ భావజాలం వివరించారు. పార్టీకి అండగా తమ వంతు బాధ్యతగా విరాళాలు పార్టీకి పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేనపార్టీ బలోపేతం దిశగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజుపేట మరియు జిలేడుపూడి జనసైనికులు, కొత్తకోట రామశేఖర్, పెనుపోతుల నాగు, నెరడుబిల్లి వంశీ, శ్రీకర్ పవర్, సేనాపతి నాయుడు, లోవ, అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.