Logo
Date of Publish : 09 September 2020, 11:20 am
Editor : Sake Naresh

ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించండి : జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ

ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకించండి : జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ

            రాష్ట్రంలో గత కొద్ది కాలంగా హిందూ దేవాలయాలు పైన.. హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అంతర్వేదిలో జరిగిన రథం దగ్ధం ఘటనను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ.. జనసేన పార్టీ వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రకటన చేసి సిబిఐ దర్యాప్తుకు కోరనున్నట్లు గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరించి వేస్తోంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలపాలని అనుకున్న నన్ను బుధవారం ఉదయం 6 గంటల నుండి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దాడుల ఘటనలను అడ్డుకోలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం విపక్ష నేతలను నిర్బంధించడం ప్రభుత్వ నిరంకుశ విధానాలకు అద్దం పడుతుంది. ప్రజాస్వామిక దేశంలో ప్రజలు తమకు అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలిపే హక్కును కూడా ఇక్కడ హరించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఖండించాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనసేన పోరాటాన్ని కొనసాగిస్తుందని జనసేన నాయకుడు పితాని బాలకృష్ణ గారు అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com