కాకినాడ ( జనస్వరం ) : తదేకం ఫౌండేషన్ సహకారంతో జనసేన పార్టి రాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్చార్జి శ్రీ పంతం నానాజీ అధ్వర్యంలో కరప మండల కేంద్రం కరప గ్రామం కొత్తపేటలో 2వ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, కరప గ్రామ అధ్యక్షులు పేకేటి దుర్గాప్రసాద్, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప గ్రామ యువ నాయకులు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు సైలవరపు భవాని శంకర్, చోడబత్తుల మణికంఠ, ప్రసన్న కుమార్, శాఖ వంశి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షులు దేవు వెంకన్న, దేవు సత్యనారాయణ (౨జమిందార్), చోడపునిడీ వెంకటరమణ, కాకర్ల బుజ్జి, గోర్లు వెంకట రమణ, మండ త్రిమూర్తులు, కొన వెంకటలక్ష్మి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com