చీమకుర్తి ( జనస్వరం ) : దిన్నెపురంలోని నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా కార్యదర్శి పెండ్యాల కోటి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ, జనసేన పార్టీ కార్యాలయానికి స్వచ్ఛందంగా స్థలం మరియు కార్యాలయం కట్టించిన తోట సుధాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు, వైసిపి పార్టీని అధికారంలో నుంచి దించే వరకు ప్రజలకు కష్టకాలమేనని, ఈ ప్రభుత్వంలో ప్రజలు ఏ ఒక్కరు సంతోషంగా లేరని, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట్యాల కోటి మాట్లాడుతూ వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలను ఎండగట్టి ,రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. చీమకుర్తి మండల అధ్యక్షుడు పల్లపు శివప్రసాద్ మాట్లాడుతూ రబ్బర్ చెప్పులు వేసుకున్న జనసైనికులం ఖద్దరు చొక్కా వేసుకున్న అవినీతి రాజకీయ నాయకులతో పోరాడుతున్నామని రాబోయే రోజుల్లో ఈ అవినీతి రాజకీయాన్ని స్వస్తి చెప్పి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూతలపాడు మండలం అధ్యక్షులు ముద్రగడ పనింద్ర, మద్దిపాడు మండల అధ్యక్షుడు నున్న బాలసుబ్రమణ్యం, తోట సుధాకర్, టీం 99 సభ్యులు పసుపులేటి హరి,పాలెం సురేష్ బాబు, సూరే ఏడుకొండలు (జిల్లా అధికార ప్రతినిధి) తోట శివాంజనేయులు, ముప్పరాజు వెంకన్న,మాయళ్ల వెంకట్రావు, వీరమాసు వీరాంజనేయులు, లింగశెట్టి కృష్ణ, విన్నకోట కృష్ణ, లింగిశెట్టి సన్నీ, కణాల మహేష్, కణాల మారుతి, చల్లా వెంకట్రావ , తన్నీరు శ్రీకాంత్ చల్లా సురేష్, పల్లపు పూర్ణ, వీర మహిళలు, తోట మహాలక్ష్మి, పల్లపు సుజాత తదితరులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com