Search
Close this search box.
Search
Close this search box.

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది : అప్పల నాయుడు

అప్పల నాయుడు

             ఏలూరు ( జనస్వరం ) : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని రెడ్డి అప్పల నాయుడు అన్నారు. ఈ సందర్భంగా రైతులు అందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని రైతు దినోత్సవం అంటే అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని రైతు వారి వారి హక్కులు సాధించుకునేది అని కూడా అర్థం.. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతు యొక్క స్థితిగతులు దిగజారేటువంటి పరిస్థితిలో ఉంది.. ఒకవైపునా పండే పంటలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుటటువంటి మద్దతు ధర ఉన్నప్పటికీ తేమ శాతం ఎక్కువ ఉందని ఆ ఒక్క వంకతో మన ప్రభుత్వం మిల్లర్స్ కుమ్మక్కై ఎవరు స్థాయిలో వారు కటింగ్లు వేస్తూ ఉన్నారు..ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు గా ఉన్నటువంటి వారిని చూసుకొని ఉంటుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 3,000 మంది పైచిలుకు వారు కౌలు రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఎందుకంటే పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక పండినటువంటి పంటను ప్రభుత్వం తీసుకొని సకాలంలో డబ్బులు వేయక వడ్డీలు కట్టలేక ఇంకో వైపున ఎరువులు మందులు సబ్సిడీపై ఇవ్వకపోవడం వల్ల బయట మందులు తీసుకున్నప్పుడు ఎరువులు గాని పురుగు మందులు గాని డూప్లికేట్ రావడం వల్ల ఆశించినంత దిగుబడి రాకపోవడం వల్ల ఎకరానికి పాతిక నుండి 30 బస్తాలు పండినప్పుడు రైతులు కట్టుబాటు కట్టుకుంటూ ఎకరానికి దాదాపు 30 వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు పెడుతూ సంవత్సరం అంతా రైతు పంట పండించి ఆ పండినటువంటి దానితో భార్య పిల్లలను పోషించుకొని మరల పెట్టుబడి కోసం చూసినటువంటి పరిస్థితుల్లో పండించడానికి డబ్బులు సకాలంలో రాకపోవడం వల్ల రాష్ట్రంలో మూడువేల పైచిలుకు మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించకపోతున్నారు..     

         ఆ రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ ప్రభుత్వానికి చలనం లేకపోయినా మానవత్వం మానవతా ఆలోచనలతో మరణించినటువంటి కౌలు రైతు కుటుంబానికి భరోసానివ్వాలి.. వాళ్ళలో ధైర్యం నింపాలి.. వీళ్ళని చూసి మరి ఎవరూ కూడా అలా మరణించకూడదని మా జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఏ చట్టసభల్లో ఎవరూ లేకపోయినా మానవతావాదంతో ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి ఇవ్వడం జరిగింది.. అలా ఉంటే అంతర్జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రైతులందరూ ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో ఏం బాధలు పడతున్నారో ఈ ప్రభుత్వం సకాలంలో స్పందించి వాళ్లు నష్టపోయినటువంటి పంటకు ఏమన్నా బీమా చెల్లిస్తుందా లేదా పండినటువంటి పంటకి వెంటనే మిల్లర్స్ ద్వారా గాని ప్రభుత్వం గాని డబ్బు చెల్లిస్తుందా అనేది జనసేన కార్యకర్తలుగా మానవతావాదులుగా నాయకులుగా మేము రైతాంగం దగ్గరికి వెళ్లి విషయాలు తెలుసుకుని ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి గాని ఇండియన్ గవర్నమెంట్ కి గాని ఇంకా ప్రజానీకానికి ఈ రైతు పండించిన వంటి అన్నం తింటున్న ప్రజానీకానికి తెలియాలి.. రైతులు యొక్క కష్టం అని మమ్మల్ని స్టేట్ వైడ్ గా పంపించడం జరిగింది.. ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి చొదిమెళ్ళకు వచ్చామని తెలిపారు.. ఇక్కడ వెంకన్న గారు, కోటేశ్వరరావు గారు, భూషణం గారు, రమేష్ గారు ఇంకొంత మంది రైతు మిత్రులను కలిసాం..కానీ సకాలంలో పంట కి సమయానికి డబ్బులు రాకపోవడం మూడు నాలుగు నెలల టైం పడటం ఆ డబ్బుకి వడ్డీ కట్టలేక రైతులు అప్పుల ఊబిలో కోరికపోవడం జరుగుతుంది.. అందుకనే ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 30 బస్తాలు దాటితే ఈ ప్రభుత్వం తీసుకోదని ఏంటో ఇప్పుడే వింటున్నాం.. గతంలో కాకినాడలో పవన్ కళ్యాణ్ గారి దీక్ష చేసినప్పుడు రైతు భరోసా కూడా రిజర్వేషన్ పేరిట అంటే బీసీలకు ఎస్సీలకి రైతు భరోసా అందేదని, ఓసీలకు రైతు భరోసా రాదు ఎందుకంటే ఓసీలు పండిస్తే 40 బస్తాలు పండుతాయి.. బీసీలు పండిస్తే 20 బస్తాలు పండుతాయి.. మనకైతే ఆ తేడా తెలియదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుసు.. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం అనేకమంది ఓట్లు వేస్తేనే గెలిచిన పంటలో మరి ఎక్కడ భారతదేశంలో ఏ ప్రభుత్వంలో గాని పంటల్లో కూడా కాస్ట్ నిర్థారించడం పద్ధతిని ఈ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చాడు.. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నాటకంలో కాకుండా నటించకుండా ప్రజల ఓట్లతో గద్దెనెక్కినటువంటి మీరు ఇప్పటికైనా రైతులు యొక్క బాధలను కనుక్కొని అలాగే ఏలూరు నియోజకవర్గం చూస్తే వెంకటాపురం పంచాయతీ లో పండినటువంటి పంటని హనుమాన్ జంక్షన్ కోరుకొల్లు అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లులకు తీసుకెళ్తున్నారు ఆ ల్యాండ్ కి పక్కన రైస్ మిల్లుకు ఖాళీగా ఉన్నాయి.. మరి దీంట్లో వాళ్ళు ఏమైనా ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చారా ? ఈ సివిల్ సప్లై మంత్రి కి ఆ రైస్ మిల్లర్స్ ఏమైనా పర్సంటేజ్ ఇచ్చారా ? అందుకనే ఆ రైస్ మిల్లర్స్ కి పంపిస్తున్నారా ? ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోండి.. మంచి బుద్ధి ప్రదర్శించాలని చెప్పి ఆశిస్తూ రైతాంగానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ గారికి హృదయం నిండా రైతాంగమని ఎవరైతే ఎఫెక్ట్ గురవుతున్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి హృదయంలో ఉంటారని, రాబోయే ఎటువంటి రోజుల్లో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉందని, రాష్ట్రంలో ఉన్న రౌడీలు క్రిమినల్స్ మాఫియాలందరిని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రైతు సమస్యలన్నీ కూడా మేము నోట్ చేసుకొని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way