
జనసేన పార్టీ అధ్వర్యంలో ” ప్రజా సమస్యల పోరాటానిక్తె జనంలోకి జనసేన” అనే కార్యక్రమాన్ని ఒంగోలు జనసేన పార్టీ కార్యలయంలో సీనియర్ నాయకులు నరహరి సాంబయ్య గారు పార్టీ జండాను ఆవిష్కరించి ప్రారంభించారు. తదుపరి జనసైనికులు అందరూ కలసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి 9వ డివిజన్‌లో గల ఇందిరమ్మ కాలని ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ ప్రధానంగా మురుగు నీరు నిల్వ సమస్య, కాలువల సమస్య, రోడ్డు లేక వర్షకాలంలో నడవడానికి పడుతున్న ఇబ్బందులు, నిర్ణీత సమయంలో రాని త్రాగునీటి సమస్య మరియు ప్రధానమ్తెన శానిటేషన్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను ప్రభుత్వ అధికారుల మరియు స్థానిక నాయకుల దృష్టికి తీసుకొని వెళ్లినా ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రజలు వాపోయారు. జనసేన పార్టీ తరుపున అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారానిక్తె పోరాడుతామని తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లి రాజేష్, బండారు సురేష్, మణి, ఈదు పల్లిగిరి, చెరుకూరి ఫణి, నరేంద్ర, భూపతి రమేష్, బ్రహ్మ నాయుడు, నాని, సుధాకర్, కిషోర్ సుభాని, శంకర్, టంగుటూరి శ్రీనివాస్, అవినాష్, నాగరాజు, వీరమహిళలు ప్రమీల, కోమలి, రాయపాటి అరుణ, వాసుకి తదితరులు పాల్గొన్నారు.