ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినా జనసేన నాయకులు. గత విద్యాసంవత్సరం ఒంగోలు Qis కళాశాలలో ఫీజు రీయంబెర్స్ మెంట్ అందక ఆత్మహత్య చేసుకున్న పాపిశెట్టి తేజస్విని కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తేజస్విని సోదరీ శ్రావణికి విద్యార్హతకు తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ గారు, జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ గారు, గిద్దలూరు ఇంచార్జి బెల్లకొండ సాయిబాబు గారు, కందుకూరు ఇంచార్జి పులి మల్లికార్జున్ గారు, జనసేన నాయకులు చీకటి వంశీదీప్ గారు, కనపర్తి మనోజ్ గారు, చిట్టెం ప్రసాద్ గారు కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ సమయానికి విద్యార్థులకు ఫీజు రీయంబెర్స్ మెంట్ అందించకపోవడంతో పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాలేజ్ యాజమాన్యం పెట్టే మానసిక ఒత్తిడికి విద్యార్థులు మరింత మానసిక దీనావస్థితికి వెళ్ళి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయంబెర్స్ మెంట్ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com