ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరుగుతున్న సందర్భంగా పెంచిన ఆస్తిపన్ను, చెత్త పన్ను ముసాయిదా బిల్లును ఆమోదించకుండా ప్రభుత్వానికి తిరిగి పంపాలని ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువ ఆధారిత వన్నుల పెంపు కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 198 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు పలు హామీలు ఇచ్చి స్థానిక ఎన్నికలు అవ్వగానే వైకాపా నిజస్వరూపం బయటపెట్టుకుందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి వైకాపా కార్పొరేటర్లు కూడా ఇంటి పన్నుల పెంపు, యూజర్ ఛార్జీలు విధింపు పై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో చిట్టెం ప్రసాద్, అడుసుమల్లి వెంకట్రావు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, బండారు సురేష్, పిల్లి రాజేష్, చెరుకూరి ఫణి, మధు బొందిల, తోట చక్రి, భూపతి రమేష్, రాజేష్ వడ్డీ, నరేంద్ర పోకల, నరేంద్ర, వెంకటేశ్వర్లు, మని, సుబ్బారావు మేడిశెట్టి, శ్రీను, వినయ్, సునీల్, సోహైల్,వసంత్, ఆగష్టిన్, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి వాసుకి, అరుణ రాయపాటి, బొందిల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.