తిరుపతి, మార్చి31 (జనస్వరం) : BRS పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆదివారం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి BRS పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ తనతో పాటు తన అనుచరులతో జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వారందరినీ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని దీన్ని ఎదుర్కొనేందుకు జనసైనికులు సిద్ధం కావాలన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని, ఈ చేరికలు చూస్తున్నట్లయితే రేపు రాబోయే ఎలక్షన్లలో కూటమి గెలవటం ఖాయమని, ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాయలసీమ మహిళా రిజనల్ కోఆర్డినేటర్ ఆకుల వనజ నగర నాయకులు లక్ష్మి, చరణ్ రాయల్ నాగరాజు నగర ముఖ్య నాయకులు జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.