సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, నూతన పరిశ్రమల స్థాపనకు, పారిశ్రామికంగా ముత్తుకూరు మండల అభివృద్ధికి రాబోయే ప్రజా ప్రభుత్వంలో టీడీపీతో కలిసి జనసేన పార్టీ అండగా ఉంటుందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. మూడో రోజైన మంగళవారం జనసేన విజయ యాత్ర సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ముతుకూరు సెంటర్ నుంచి కృష్ణపట్నంలోని శివాలయం సందర్శన, అక్కడి నుంచి పంటపాలెం వరకు కొనసాగుతుందన్నారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈ విజయ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను విముక్తి చేయడం, వైసిపి విముక్తి ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా, అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడమే తమ లక్ష్యం. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పారిశ్రమకంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న మండలం. ఆసియా ఖండంలోని అతి పెద్దదైన రెండవ పోర్టు కృష్ణపట్నం పోర్టు, అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాపడిన నాటి నుండి నూతన పరిశ్రమల నిర్మాణం లేదు. పోర్టు నిర్మాణం కోసం అనేక కుటుంబాలు, వాళ్ళ భూములను కోల్పోయారు. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఆ రోజు ఇచ్చిన హామీలు ఏవి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదు. అయితే రెండుసార్లు శాసనసభ్యులు గెలిచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చెప్పట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాటలు మాత్రం యలమంద లెక్కలు చెబుతూ మసిబూసి మారేడు కాయ చేసే విధంగా మీడియా ముందు మాట్లాడి కాలయాపన చేస్తున్నారే తప్ప సర్వేపల్లి నియోజకవర్గానికి కావచ్చు, ముత్తుకూరు మండలాన్ని కావచ్చు, ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అలా ఆయన ఏమన్నా అభివృద్ధి చేసుంటే దానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తే మేము కూడా తెలుసుకుంటాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఇతనిని ఇంటికి పంపిద్దామని ఆలోచనతో ఉండారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీలను ఆదరిస్తారని విజయం వైపు నడిపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ వీర మహిళా గుమ్మినేని వాణి భవాని, విజయలక్ష్మి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, సుమన్, మండల అధ్యక్షుడు గణపతి మస్తాన్, మహబూబ్నగర్, కార్యదర్శి శ్రీహరి, మనుబోలు మండల నాయకులు సుధాకర్, రహమాన్, పసుపులేటి మురళి తదితరులు పాల్గొన్నారు.