మదనపల్లి ( జనస్వరం ) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఒకటి అమ్మ ఒడి పథకం 2021 -22 సంవత్సరానికి గాను జనవరిలో అమ్మ ఒడి పథకానికి సంబంధించిన సొమ్ము అమ్మల ఖాతాలలో పడలేదు. దీనికి ప్రభుత్వం కొత్త నిబంధన షరతులను తెరపైకి తెచ్చిందని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అన్నారు. ఆమె మాట్లాడుతూ చదువుకునే బిడ్డతల్లి ఒకే చోట ఉండాలి కొత్తగా ప్రకటించిన జిల్లాలోని ఆధార్ కార్డు అడ్రస్ ఉండాలి అదే విధంగా కొత్త రేషన్ కార్డు ఉండాలి విద్యార్థి యొక్క అటెండెన్స్ 70 శాతానికి తక్కువ ఉండకూడదు. కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటి ఉండకూడదు ఈ యొక్క షరతులకు ఎవరు అర్హులు కారు కాబట్టి ఈ యొక్క పథకం కొనసాగదని అన్నారు. 2017 లో వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి తానే స్వయంగా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వాళ్ళు తమ పిల్లలను చిన్న వయసులోనే పనులకు పంపిస్తున్నారు. కనుక చదివించే బాధ్యత మా ప్రభుత్వం రాగానే తీసుకుంటామని చెప్పారు ఇదే విషయాన్ని పలు సార్లు ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన మాట తప్పారు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తేవడంతో వైఫల్యం.. విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది పలు రకాలుగా ప్రజల నుండి వారిని పీడిస్తూ సొమ్ము వసూలు చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిన మడమ తిప్పిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో గద్దె దిగడం ఖాయం ప్రజలే సరైన సమాధానం చెబుతారని అన్నారు.