● బాలాజీ నాయుడు వెళితే న్యాయం – మేము అడిగితె అది అక్రమమా?
● బాలాజీ నాయుడు విద్యార్థులను పరామర్శిస్తే అది ఆదరణ – మేము పరిశీలిస్తే అది దిక్కారమా?
● వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడుపై కేసు నమోదు చేయాలి
● జిల్లా విద్యాశాఖాదికి లేఖ రాసిన జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ
కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటి నగరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఈ నెల 2 వ తేది వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడు తనిఖీ చేయడాన్ని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ తీవ్రంగా ఖండించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులే తనిఖీ చేయాలనీ చెప్పిన విద్యా శాఖాది కారులు బాలాజీ నాయుడు విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ బాలాజీ నాయుడుకి ఒక చట్టం, జనసేనకు మరొక చట్టమా అని ధ్వజమెత్తారు. లేక చట్టం మీ చుట్టమా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలాజీ నాయుడు వెళితే న్యాయం, మేము అడిగితె అది అక్రమమా? అని దుయ్యబట్టారు. బాలాజీ నాయుడు విద్యార్థులను పరామర్శిస్తే అది ఆదరణ, మేము పరిశీలిస్తే అది దిక్కారమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడుపై కేసు నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖాదికి పిర్యాదు చేస్తున్నాని ఈ సందర్బంగా తెలిపారు.