Logo
Date of Publish : 17 May 2023, 3:27 pm
Editor : Sake Naresh

రైతులకు ఒక చట్టం… కబ్జాదారులకు మరో చట్టమా ???

       రాజంపేట ( జనస్వరం ) :  95 సెంట్లు పొలంలో నాటిన చెట్లను తొలగించిన అధికారులు. లబోదిబో ఏమంటున్న రైతు కుటుంబం. సుండుపల్లి మండలంలోని మల్లక్కగారిపల్లికి చెందిన రెడ్డి చర్ల వెంకటరమణ అనే రైతు 95 సెంట్ల ప్రభుత్వ భూమిలో నాటిన మామిడి చెట్లను రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించినట్లు తెలిపారు. లోకాయుక్త ఆదేశానుసారం దాదాపు 60 మామిడి చెట్లను కూకటివేళ్లతో పేకలించినట్లు రైతు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పర్యటించి అక్కడ దృశ్యాలు నష్టాన్ని పరిశీలించి రైతుకు జరిగిన అన్యాయం చాలా దౌర్భాగ్యమని  అన్నారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సుండుపల్లి మండల కేంద్రంతో పాటు మండల కేంద్రానికి ఇరువైపులా ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల కనుసనల్లో కబ్జాలకు గురవుతుంటే పట్టించుకోని రెవెన్యూ అధికారులు బోరు వేసి చెట్లు నాటి వ్యవసాయం చేస్తున్న రైతు చెట్లను తొలగించడం ఏమిటని జనసేన తరపున తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రధాన ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ స్థలాలు, వంకలు, చెరువులు, గుట్టలు కబ్జాలకు గురవుతుంటే పట్టించుకోని అధికారులు రైతులపై పెత్తనం చెలాయించడం ఏమిటని పలువురు ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. రైతుకు ఉన్న స్థలం పక్కన కాస్తో కూస్తో ప్రభుత్వ భూమి వ్యవసాయానికి వినియోగిస్తే నేరం... ప్రభుత్వ స్థలాలు కబ్జాదారుల కనుసనల్లో అధికారుల సహకారంతో విక్రయాలు చేయడం నేరం కాదా అని రైతులు అధికారుల తీరును తప్పుపడుతున్నారు. సుమారు రెండు సంవత్సరాలకు పైగా కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లను అధికారులు కనికరం లేకుండా నరికేశారని రైతు బోరుమని విలపించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com