రెండో రోజు భవన నిర్మాణ కార్మికుల 70 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన వీర మహిళ షేక్ హలీ బి గారు
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న సుమారు 70 మంది భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రైల్వే కోడూరు వీర మహిళ శ్రీమతి షేక్ హాలిమా బీ గారు. హాలీమా గారు మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని, ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అని ఆమె తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని అన్నారు. ఈ కరోనా విపత్కర సమయంలో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి రావడంతో వారికి తగిన సహాయం చేశాను అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com