శ్రీకాకుళం ( జనస్వరం ) : వినాయక చవితి &జనసేనాని పుట్టిన రోజు వేడుకలు దగ్గర ఉండటం తో జనసైనికులు పండగ వేడుకల వాతావరణం మొదలు పెట్టారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసైనికులు జెమ్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి జన సేనాని 51 వసంతాల సందర్బంగా 51 జన సైనికులు రక్త దానం చేశారు. అదే రోజు వినాయక చవితి సందర్బంగా పర్యావరణ దృష్ట్యా 200 ఉచిత మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంచినారు. అదే విధంగా పలు ప్రభుత్వ స్కూల్ లో వచ్చే నెల రోజుల్లో ఉచిత వైద్య శిబిరలు ఎర్పాటు కోసం జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జన సేన నాయకులు బమ్మిడి సిద్దు, జన సేన నాయకులు మరియు కాపు సంఘం కార్యదర్శి రాజేష్ నాయుడు, శ్రీకాకుళం నియోజక వర్గ నాయకులు నవీన్, శ్రీకాకుళం నియోజక వర్గం జన సేన మైనారిటీ సంఘం నాయకులు MD. Rafi, మెగా అభిమాన సంఘం క్రీయశీల నాయకుడు సిద్దయ్య, శ్రీకాకుళం నియోజక వర్గ అభ్యర్థి కోరాడ సర్వేశ్వర రావు మరియు వీర మహిళలు మరియు పలువురు జన సైనికులు నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన సేనాని పుట్టిన రోజు సందర్బంగా ఇకపై నియోజక వర్గం పరిదిలో సమస్యల పై , విద్య వైద్య అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని, సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకోని వెళ్ళి పరిష్కార మార్గాలు వచ్చేలా చూస్తాం అని శ్రీకాకుళం నియోజక వర్గ జన సైనికులు నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.