శింగణమల ( జనస్వరం ) : నార్పల మండలంలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాలలో రైతులతో వారి పొలంలోనే నేరుగా కలవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రైతుల కష్టాలను తెలుసుకొని ప్రభుత్వం రైతులకు ఎటువంటి సహకారం అందిస్తే లాభసాటిగా వ్యవసాయం మారుతుందో తెలుసుకొనడమైనది. వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా చర్యలు చేపడతామని జనసేన పార్టీ తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ రైతుల పక్షపాతి అని దానికి నిదర్శనం రాష్ట్రవ్యాప్తంగా ఆత్మ హత్య చేసుకున్న దాదాపు 650 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 6 కోట్ల 50 లక్షల రూపాయలు ఇప్పటివరకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే వారి పిల్లల చదువుల కోసం జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం కూడా జరిగింది .అధికారంలో లేకున్నా తన సొంత కష్టార్జితాన్ని అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అందించడం ద్వారా రైతుల పట్ల జనసేన పార్టీకి మరియు అధినాయకుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న అంకిత భావానికి నిదర్శనం మన్నారు. అలాగే 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనే పథకాన్ని భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదని జనసేన పార్టీ తన మేనిఫెస్టోలో ఉంచడం రైతుల పట్ల జనసేన ప్రభుత్వం వస్తే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో తెలుస్తోందన్నారు.సూక్ష్మ చిన్న కారు రైతులకు అధిక పెట్టుబడి భారం కాకుండా నాణ్యమైన ఎరువులను విత్తనాలను సబ్సిడీపై అందించడం ద్వారా మరియు రైతులు పండించిన పంటను ఆపర్చునిటీ జోన్స్ ల ను ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ఎగుమతిదారులతోనే లావాదేవీలు చేయడం వల్ల అధిక గిట్టుబాటు ధరను పొందే అవకాశాలను, నీరు వసతి లేని పంట పొలాలకు ఆధునిక పద్ధతుల ద్వారా నీటిని అందించే మార్గాలను అన్వేషించి వాటిని రైతులకు అవగాహన కల్పించి కృషి చేస్తుంది.అలాగే రైతులకు సంవత్సరానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద జనసేన ప్రభుత్వం అందించేలాగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.వ్యవసాయాన్ని ఉపాధి హామీ పథకం కింద చేర్చడం ద్వారా రైతులపై కూలీల కొరతతో పాటు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయం చేయడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు జనసేనా పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు వినోదం బయన్న శివయ్య చెన్నకేశవులు బయన్న జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ పొన్ను తోటరామయ్య నారాయణస్వామి లోకేష్ కిరణ్ నవీన్ బ్రహ్మ రమణ రాకేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com