విజయవాడ, సెప్టెంబర్ 30 (జనస్వరం) : పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిట్టినగర్ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం వద్ద ఎరిపిల్ల కనకరావు, జిల్లెల అనిల్, రాళ్లపూడి గోవిందరావు ఆకారపు విజయ్ కుమారి సాయి రమేష్ తదితరుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద చిరు వ్యాపారస్తులకు అండగా ఉండేందుకు 10 తోపుడుబండ్లను అందజేశారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం వద్ద వడ్డాది రాజేష్ యూత్ చింతలపూడి సురేష్, బెవర లోకేష్ యూత్, బాదర్ల శివ గంజి పవన్ తదితరుల ఆధ్వర్యంలో భారీ స్టేజిని ఏర్పాటు చేసి 46 కేజీల కేకును కట్ చేసిన అనంతరం గజమాలతో సత్కరించారు. షేక్ ఏజాస్ పండు, రాకీ, హేము, జగదీష్, ప్రశాంత్, పైలా పవన్, సుఖాసి భాను, ఆదిత్య రెడ్డి, నగేష్ సోమి మహేష్ తత్తర్ల ఆధ్వర్యంలో మహేష్‌పై ప్రత్యేక ఏవీని విడుదల చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com