గుడివాడ ( జనస్వరం ) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో బక్రీద్ పండగ సందర్భంగా ఆకలితో ఉన్న అనార్థులకు ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(RK) మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ నాయకులకు మరియు ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని, భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సాంకేతమైన ఈ పండగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారని, ఈ పండగ సోదర భావం ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండగ చాటి చెబుతుందని, ఆ ఆలోచనతో ఈరోజు ఆకలితో ఉన్న అనార్థులకు ఆహారం అందజేయడం జరిగిందని తెలియజేసినారు కుల మతాలతీతంగా గుడివాడ పట్టణంలో అందరూ కలిసికట్టుగా ఉండి మన గుడివాడ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేసినారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరగా ఉండి ప్రజల సమస్యల మీద పోరాడతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో చేసిన మా Rk వారియర్స్ కు, మరియు జనసేన నాయకులు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు, నూనె అయ్యప్ప, దివిలి సురేష్, చరణ్ తేజ్, భాగి సుమంత్, శ్రీరామ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com