Logo
Date of Publish : 24 July 2023, 9:41 pm
Editor : Sake Naresh

సర్వేపల్లి నియోజకవర్గంలో 31వరోజు ‘జనం కోసం – జనసేన’

      సర్వేపల్లి, (జనస్వరం) : సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం బద్దేవోలు రోడ్డు సంగమేశ్వర స్వామి కాలనీ నందు 31వరోజు ఆదివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో రాజధాని లేని రాష్ట్రం, కంపెనీలు ఏర్పడని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడిపోతున్న రాష్ట్రం, పథకాల పేరుతో ఓట్ల రూపాయలు అవినీతి జరుగుతున్న రాష్ట్రం ప్రజా నాయకులు అని చెప్పుకొని ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు బూతులు మాట్లాడుతున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్లో ముందుండే రాష్ట్రం కోట్ల రూపాయల గ్రాఫిల్ మాఫియా జరుగుతున్న రాష్ట్రం ఇసుక మాఫియా జరుగుతున్న రాష్ట్రం ల్యాండ్ మాఫియా జరుగుతున్న రాష్ట్రం మన రాష్ట్రం మొదటి వరుసలో ఉండటానికి గల కారణం ఒక అవినీతిపరుడుని ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రి చేయడమే కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి నీతి నిజాయితీగల నాయకుడిని ఎన్నుకుంటారని. రాబోయే 2024 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన సారథ్యంలో రాష్ట్రం బాగుంటుందని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాజధాని నిర్మాణం జరుగుతుందని, యువత భవిష్యత్తు బాగుంటుందని మేమందరము ఆశిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు కూడా ఒక్క క్షణం ఆలోచించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనుబోలు మండల అధ్యక్షుడు ప్రసాద్, నాయకులు జాకీర్, ఖాదర్ వల్లి, కోటి, సుధాకర్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, శ్రీహరి, వంశీ, సాయి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com