" దివీస్ మాకొద్దు – పర్యావరణమే ముద్దు "
దివీస్ కొత్త యూనిట్. దిగ్గజ ఫార్మా సంస్ధల్లో ఒకటైన దివీస్ లాబొరేటరీస్ తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద తమ మూడో యూనిట్‌ను ప్రారంభిచేందుకు ఏర్పాట్లు ను ఏర్పాటు చేసుకుంటున్న ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి తొండంగి వద్ద రూ.1500 కోట్ల వ్యయంతో కొత్త యూనిట్ నిర్మాణానికి సిద్దమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్ . దీనితో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు, విశాఖపట్నం సమీపంలోనూ యూనిట్లు నడుపుతున్న దివీస్ ఫార్మా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గంలో ఈ ప్రతిష్టాత్మక యూనిట్ నిర్మాణానికి పావులు కదుపుతోంది. ఈ ఫార్మా సంస్ధ విస్తరణ కోసం కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. విపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు సమర్ధిస్తోంది. అలాగే అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. దీంతో వైసీపీ, టీడీపీ డబుల్ గేమ్‌పై స్ధానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం దివీస్ ఫార కు మద్దతుగా చేస్తున్న చర్యలను వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇక్కడ భూసేకరణకు జరిగే చర్చలు స్థానికుల్లో ఆందోళనలు రేపుతుంటే, వీరికి జనసేన శ్రేణులు మరియు ప్రజా సంఘాలు మద్దతు నిలుస్తూ పోరాటం చేస్తున్నాయి. అధికారం అండదండలతో బలవంతంగా భూమిని సేకరించి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
రాజకీయ నాటకాలు :
వైసీపీ, టీడీపీ పిల్లిమొగ్గలు.. గతంలో విపక్షంగా ఉండగా ఎట్టి పరిస్ధితుల్లోనూ దివీస్ ఫార్మా ఏర్పాటు కాకుండా చూస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే దానికి మద్దతిస్తోంది. అలాగే గతంలో అధికారంలో ఉండగా దివీస్ ఫార్మా ఏర్పాటును సమర్ధించిన టీడీపీ ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతోంది. ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదనలు చేస్తున్న నేపథ్యంలో దివీస్ ఫార్మా ఏర్పాటు వల్ల మత్సకారుల జీవనోపాధి దెబ్బతింటుందని స్థానికులు, మరియు జనసేన నాయకులు అనేక పర్యాయాలు ధర్నాలు మరియు రాస్తారోకలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే AP CM జగన్ గారు డిసెంబర్ 7 వ తారీఖున దివిస్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి పూనుకోగా అక్కడ స్థానికుల్లో మరొక్కసారిYSRCP ప్రభుత్వంపై తమ అసహనాన్ని వ్యక్తంచేస్తు నిరసనలు చేశారు. 60:40 భాగస్వామ్యం కింద అప్పటి ప్రభుత్వం టిడిపి మరియు ఇప్పటి ప్రభుత్వం YSRCP తో దివిస్ యజమాన్యం సత్సంబంధాలు కలిగి ఉండటం వలన, ప్రభుత్వంలో ఏ పార్టీ వారు ఉన్న దివిస్ పరిశ్రమకు ఆటంకాలు రాకుండా అనుమతులు ఇవ్వాలని వారి అంతర్గత ఒప్పందాల్లో భాగంగా తెలుస్తుంది. దీనిని జనసేన నాయకులు మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు గుర్తించి పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.
స్థానికుల మాట ఏంటి ?
రాష్ట్ర ప్రభుత్వాలే వరుసగా మాకు వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు మేం చెయ్యాలో పాలుపోవడంలేదు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, మాలో ఓ 10మంది చద్దాం అనుకుంటున్నాం అని కంట తడి పెట్టుకున్నారు. మాజీ స్పీకర్ శ్రీ యెనుమల రామకృష్ణుడు, అతని సోదరుడు మరియు జిల్లా పరిపాలన వ్యవస్థ 2016 లో దివిస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి అంగీకరించామని మమ్మల్ని బలవంతం చేసిన కథను గ్రామస్తులు చెప్పారు. తరువాత జగన్ మోహన్ రెడ్డి గారు తమ మండలంలో బహిరంగ సభలో మాట్లాడుతూ “చంద్రబాబుకి బుద్ది లేదు ఈ సున్నితమైన ఆక్వా జోన్‌లో ఈ కాలుష్య తయారీ యూనిట్‌ను ఎలా అనుమతిస్తారు? ఈ యూనిట్ 55లక్షల లీటర్ల కలుషిత నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుంది. దానివల్ల చేపలు మరియు రొయ్యలు నశించిపోతాయి మరియు మీ గ్రామాల ప్రజలు జీవనోపాధిని కోల్పోతారు, మహిళలకు పిల్లలు పుట్టరు, ఇది మానవులతో పాటు సముద్ర జీవులకు కూడా ప్రమాదం కలిగిస్తుంది” అన్నారు. అతనిని విశ్వసించి 2019లో ఆయనకు ఓటు వేశారు, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు సీయం అయ్యాక , తన వాగ్దానం మరచిపోయి పోలీసుల శక్తితో తొందంగిలో ఆ విషపు యూనిట్‌ను ఏర్పాటు చేయమని దివీస్ ను ప్రోత్సహిస్తున్నాడు. ఇది దారుణం అన్నారు. తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దినట్టే అని వాపోయారు. ఆ గ్రామం నుంచి వచ్చిన శ్రీమతి నాగ కృష్ణవేణి “జగన్నన్నా నా నెత్తిమీద చెయ్యి వేసి ప్రమాణం చేసావు, ఈ విషం కక్కే ఫ్యాక్టరీని బంగాళాఖతంలో కలిపేస్తానన్నావు.. మర్చిపోయావా, నీ స్పీచ్ ఒకసారి చూడు గుర్తు తెచ్చుకో మాకు న్యాయం చెయ్యు.. ఫ్యాక్టరీని వదిలి మమ్మల్ని బంగాళాఖతంలో కలపక” అని రోదించింది.
జగన్ ఎందుకు మాట మారుస్తున్నాడు ?
నాటి ప్రతిపక్ష, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అధ్యక్షుడు, “తొండంగి మండలం దానవాయిపేట పంచాయితీ పరిధిలోని కొత్తపాకాల సమీపంలో దీవిస్ పరిశ్రమ ఏర్పాటుకు నాడు 2016 సంవత్సరంలో నవంబర్ 21 తేదీన రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఓదార్పు యాత్రలో భాగంగా అక్కడకు వెళ్లిన అప్పటి ప్రతిపక్షనేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, దివిస్ పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి చెప్తూ ‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, దీవిస్ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకుంటానని హామీ’ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో చూడండి. లింక్ : https://youtu.be/5AjCZawN4go . ఇపుడు అధికారంలోకి వచ్చి మాట మారుస్తున్నారు. మాట తప్పను మడమ తిప్పను అని గారభాలు పలికే వ్యక్తి ఇపుడు ఎందుకు మూగబోయాడు. ఏమైనా సూట్ కేస్ లు ముట్టాయా ??
జనసేన పోరాటం :
60:40 భాగస్వామ్యం కింద అప్పటి ప్రభుత్వం టిడిపి మరియు ఇప్పటి ప్రభుత్వం YSRCP తో దివిస్ యజమాన్యం సత్సంబంధాలు కలిగి ఉండటం వలన, ప్రభుత్వంలో ఏ పార్టీ వారు ఉన్న దివిస్ పరిశ్రమకు ఆటంకాలు రాకుండా అనుమతులు ఇవ్వాలని వారి అంతర్గత ఒప్పందాల్లో భాగంగా తెలుస్తుంది. దీనిని జనసేన నాయకులు మరియు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు గుర్తించి పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఫార్మా పరిశ్రమలు అనేవి జనవాసంలో కాకుండా ఫార్మా హబ్ లలో ఏర్పాటు చేయాలని, ఇలా జనవాసంలో ఏర్పాటు చేస్తే కలిగే నష్టలెంటో అని పలుమార్లు విన్నవించారు. చెవిటి వాణి ముందు శంఖం ఉదినట్లు అప్పటి టిడిపి వారు, ప్రస్తుతం YSRCP ప్రభుత్వం వారు ఒకరి మీద ఒకరు తోసుకుంటూ కిమ్మనకుండా మొత్తం తతంగాన్ని నడిపిస్తున్నారు.
రైతులను ఉద్దేశించి జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ GO నెంబర్ 1307 / 23.12.1993 ప్రకారం, D పట్టా భూములను ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే తీసుకోవచ్చు, కేటాయించిన భూములకు పరిహారం చెల్లించే విధానం కూడా ఉంది. అలాకాకుండా జులుం చేస్తే జనసేన వారికి అండగా ఉంటుంది. ఈ గ్రామాలన్నిటి జీవనోపాధిని కాపాడటానికి మరియు ఆ ప్రాంతంలో జల జీవనాధారాలను కాపాడటానికి అన్ని చట్టపరమైన సహాయం చేస్తుంది, ఈ జోన్‌ను ఆక్వా జోన్‌గా ప్రకటించే వరకూ వారి తరపున పోరాడతానని ఆయన తోండంగి మండల గ్రామస్తులకు కాలుష్యరహిత సముద్ర సంబంధిత యూనిట్లు మాత్రమే అక్కడ ఏర్పాటు చేయబడతాయి హామీ ఇచ్చారు. జనసేన పర్యావరణ కార్యదర్శి బోలిసెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, భీమిలిలో ఉన్న దివిస్ యూనిట్ ఇప్పటికే సముద్ర జీవులకు, మత్స్యకారుల జీవనోపాధికి ముప్పుగా మారిందని, క్రమబద్ధీకరించని కాలుష్యంతో 16 గ్రామాలు ప్రభావితమయ్యాయని చెప్పారు.
పర్యావరణం దృష్ట్యా దివీస్ :
అందం వెనుక ప్రమాదం ఎలా దాగుంటుందో అలాగే ప్రకృతి వనరులు సంవృద్ధిగా ఉన్న చోట అవకాశవాదులు, ధనమే పరమావధిగా భావించే రాజకీయ నాయకులు మరియు వ్యాపారస్తులు దానిని వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వీరు ప్రకృతి, ప్రజల ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలతో మొండిధోరణితో అధికారం అద్దం పెట్టుకొని వ్యవహరిస్తారు. ఏదైనా ఒక ప్రాంతం నివాసయోగ్యంగా ఉండాలంటే కనీసం అక్కడ కలుషితం లేని నీరు, కలుషితం లేని గాలి తదుపరివి ఉండాలి. దివిస్ కాలుష్య కోరల్లో ప్రజలు, పంటలు, భూగర్భ జలాలు... ఒకటేమిటి ఆ చుట్టూ పక్కల పల్లెల ప్రజలు నివసించడానికే అత్యంత ప్రమాదకర స్థాయిలోకి నెట్టబడతరు. పుష్కల ప్రకృతి వనరులే వారి పాలిట శాపం అయ్యాయి నేడు. తొండంగి మండలం మరియు చుట్టుప్రక్కల ప్రజల అభ్యర్థనలు, గోడు నేడు అరణ్యరోదనను తలపిస్తుంది. తిలా పాపం తల పిడికెడు అన్న చందంగ టిడిపి మరియు వైఎస్‌ఆర్‌సిపి వ్యవహరించాయి.
విశాఖ తీరంలో ఉన్న దివిస్ ఫ్యాక్టరీల నుంచి వెలువడే విషవాయువుల వలన వేలాదిమంది అమాయకుల ప్రజలు పండుటాకు వలె రాలిపోతున్నారు. కాలుష్య నివారణ కంటే కాసులే ముఖ్యమైపోయాయి నేటి రాజకీయ ప్రతినిధులకు మరియు వ్యాపారస్తులకు. ఈ సంఘటన నుండి నుండి తొండంగి మండలం మరియు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు చైతన్యం అయ్యి దివిస్ పరిశ్రమ ఏర్పాటైతే త్వరలోనే రాబోయే విపత్తులను గ్రహించి, ముందునుండి దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వస్తున్నారు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
By
కొన్నిపాటి రవి
ట్విట్టర్ ఐడి : @KPR_India
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com