మదనపల్లి ( జనస్వరం ) : జనసేన కార్యాలయంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ మదనపల్లెలో జనసేన చాలా బలంగా ఉందని జనసేన కోసం మదనపల్లెలో ప్రతి ఒక్క జన సైనికుడు జనసేన వీర మహిళ జనసేన నాయకులు ఇప్పుడు పని చేస్తున్నారని అన్నారు. దానికన్నా ఎక్కువగా పని చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన ప్రకారం టిడిపి క్యాడర్ తో కలిసి మనం పని చేస్తున్నామని ఇక ముందు కూడా ఇలాగే పని చేయాలని అన్నారు. అలాగే టిడిపి జనసేన ఇరు పార్టీలు కలిసి ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి దొంగ ఓట్లని కనిపెట్టాలని కోరారు. చనిపోయిన వారు బయట ఊరిలో ఉన్నవారు ఓట్లను తొలగించేలా ఆయా బూత్ కి సంబంధించిన బిఎల్వోలతో, వాలంటీర్లతో సంబంధిత అధికారులతో చర్చించి ఓటర్ లిస్ట్ లోని అక్రమ ఓటర్లను తొలగించాలని కోరారు. అలా తొలగించని పక్షంలో ప్రతి బూత్ వైజు ఉన్నటువంటి దొంగ ఓట్లని జనసేన బయట పెట్టడమే కాక ఆయా బూతులకు సంబంధించిన బిఎల్వోలు ,వాలంటీర్ల మీద కూడా చర్యలు తీసుకొనేలా అక్రమ ఓటర్ల జాబితా బయట పెట్టడం జరుగుతుందని మీడియాపరంగా తెలియజేయడమైనది. గతంలో తిరుపతి లోక్ సభ ఫ్రీ ఎలక్షన్స్ లో అక్రమ ఓటింగ్ కు సహకారం అందించారని ఐఎఎస్ అధికారి గిరీష్ గారిని విధులనుండి తొలగించిన విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, వినయ్ కుమార్ రెడ్డి, షేక్ యాసీన్, జనసేన సోను, సుప్రీం హర్ష, గంగాధర్, జాఫర్ , రెడ్డి , గోపాల్, శేఖర్ , బహదూర్, వీర మహిళలు రూప, లక్ష్మి దేవి, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com