గిరిజనుల భూములను కబ్జా చేస్తే సహించేది లేదు : అరకు జనసేన నాయకులు మాదాల శ్రీరాములు

              అరకు ( జనస్వరం ) : అనంతగిరి మండల పరిధిలోని దాసరితోట గ్రామంలో జనసేనపార్టీ మండల అధ్యక్షుడు చిట్టం మురళి, వీరమహిళ రత్నప్రియ, అరుణ, చలం ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. దాసరి తోట గ్రామస్తులు చంపి రాముడు S/౦ బొడిష్ చంపి ఎరుకులు S/౦ బోడేస్ అను రైతుల భూములు 8.22 ఎకరాలు భూకబ్జాకు గురైందని వారు తెలిపారు. సర్వే no 61 పట్టాలో బోడెస్ పేరున ఉంది. కొంత మంది అనామకులు గిరిజనుల పేరుమీద ఉన్న భూమిని రెవెన్యూ సిబ్బందితో కలిసి గిరిజనులను బెదిరిస్తున్నారు. మీ భూములు మేము కొన్నాం. మీరు భూములు జోలికి రావద్దు అని గిరిజనులకు బెదిరిస్తున్నారు. గిరిజనులు ఏమి చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. ఏదైతే గిరిజనుల భూములు కబ్జాచేయడానికి చూస్తున్నారో వారిపై తక్షణమే LTR కేసు నమోదు చేసి వారిని వెంట అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.  జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది వెంటనే స్పందించి సాగు చేస్తున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.  బెదిరిస్తున్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో చేతులు కలిపి రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి లేని పక్షన రైతుల తరపున పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకూ రైతులకు అండగా ఉంటామని తెలిపారు. రైతుల భూముల జోలికి వస్తే జనసేనపార్టీ అండగా ఉంటుంది అని గ్రామస్తులతో సమావేశమై కబ్జాకు గురైన ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ మీకు న్యాయం జరిగే వరకు జనసేనపార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొనెడి లక్ష్మణ్ రావు, దూసరి గంగరాజు, కిల్లో మొస్య, బంగురు రామదాసు, అరకువెలి అల్లంగి రామకృష్ణ, వీరమహిళ రత్న ప్రియ  అరుణ చలం తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way