Logo
Date of Publish : 12 August 2020, 6:53 am
Editor : Sake Naresh

ఓ సారూ..! జర ఈ వంతెన గురించి పట్టించుకోండి : జగ్గయ్యపేట జనసేన నాయకులు

ఓ సారూ..! జర ఈ వంతెన గురించి పట్టించుకోండి : జగ్గయ్యపేట జనసేన నాయకులు

         జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట పట్టణం నుంచి అగ్రహారం వెళ్లే మార్గంలో స్థానిక స్టీల్ ప్లాంట్ సమీపంలో అతి భయంకరమైన మరియు ఇబ్బందికరగా ఉన్నటువంటి అగ్రహారం బ్రిడ్జి మార్గాన్ని ఈరోజు నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ తరుపున సందర్శించి, రోడ్ మరమ్మతులు కోరుచున్నామని స్థానిక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ (MDO) వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ రవాణా రంగంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన ఈ నగరం ప్రముఖ కెసీపీ సిమెంట్ కానివ్వండి కెసియల్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాహన లారీ లు మరియు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబందించిన కార్మికులు, ఆఫీసర్లు మరియు కాలనీ ప్రజలు ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన అవసరం ఉందని, అదే విధంగా ముక్త్యాల, కోటిలింగాలు, పులిచింతల వంటి విహార యాత్రలకి దేవాలయాలకు పట్టణ ప్రజలు, యాత్రికులు ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన అవసరం ఉన్నందున ఇటువంటి ఇబ్బందికరంగా తయారైనటువంటి ఈ రోడ్ మార్గం వలన అటు ప్రయాణికులు ఇటు అగ్రహారం, ముక్త్యాల, స్టీల్ ప్లాంట్ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులకి గురి అవుతున్నారు అని ఆయన తెలిపారు. ఈ ఇబ్బందికర రోడ్ మార్గం వలన కొంత మంది వారి విలువైన ప్రాణాలను కూడా కోల్పోయారని ఈ సందర్భంగా ఆయన తెలియచేసారు. తక్షణమే ప్రభుత్వం వారు ఈ రోడ్ మార్గానికి మరమ్మతులు చేయవలసిందిగా, అదే విధంగా సాధ్యమైనంతవరకు ఈ బ్రిడ్జ్ యొక్క వెడల్పుని పొడిగించవలసినదిగా నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్, బాడిశ మురళి, మహేష్, త్రిశాంత్, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com