Logo
Date of Publish : 15 October 2020, 10:33 am
Editor : Sake Naresh

ఓ సారూ… మా గోడును పట్టించుకోండి : అవనిగడ్డ జనసైనికులు

ఓ సారూ... మా గోడును పట్టించుకోండి : అవనిగడ్డ జనసైనికులు

                   అవనిగడ్డ చల్లపల్లి నారాయణ రావు నగర్ కాలనీలో గత కొన్ని రోజులు నుండి కురుస్తున్న వర్షాల వలన వర్షపు నీరు ఇళ్ళ మధ్య చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు ఉండటం వలన అక్కడ భరించలేని దుర్వాసన మరియు పందులు చేరడం వలన ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇలాగే పరిస్థితి ఉంటే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. చల్లపల్లి కోమలా నగర్ లో పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వస్తాయి. చిన్నపిల్లలతో పాముల, పందులు బురదమయం అయిన ఇళ్ళ మధ్య భయం, భయంతో నివాసం ఉంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.  చల్లపల్లిలో పార్వతమ్మ తోట లోని వృద్ధ ఆశ్రమం దగ్గర వర్షపు నీరు చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మీద నడవలేని పరిస్థితి లో ఉన్నారు. అధికారులు స్పందించి వర్షపు నీరు ని తొలగించి, బ్లీచింగ్ చల్లి ప్రజలు రోగాల భారిన పడుకుండా కాపాడాలని జనసేన పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంజిత్ కుమార్ మడమల, సూదాని నందగోపాల్, మల్లం నాంచారయ్య, భానుచందర్, సోమరౌతు నాంచారయ్య, బీజేపీ నాయకులు పీతా లక్ష్మీ ప్రతాప్ మరియు స్థానికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com