Logo
Date of Publish : 10 May 2022, 1:37 pm
Editor : Sake Naresh

ఓ మహాప్రభో రోడ్లేయండి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

            మదనపల్లి ( జనస్వరం ) : ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఏ జిల్లాలో చూసిన రోడ్లు అత్యంత ప్రమాదకరంగా భయానకంగా మారాయని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికాముఖంగా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ  పల్లెల్లోని రహదారుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక మరమ్మతులకు నోచుకోక పోవడంతో రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే పరిస్థితి మరీ దారుణమని అన్నారు. పల్లెల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించాలన్న సాగుకు అవసరమైన ఎరువులు వంటివి తెచ్చుకోవాలన్న, ఈ అద్వానపు రోడ్ల మూలంగా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఒక పల్లె కాదు ఒక ఊరు కాదు, ఎక్కడ చూసినా ఇదే దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని రాష్ట్రప్రభుత్వం మూడేళ్లుగా రహదారులకు నామమాత్రంగా ఇస్తూ అధికశాతం నిధులు భవనాల నిర్మాణానికి కేటాయించడంతో గ్రామాలలో కనీస మరమ్మతులకు కూడా నోచుకో వట్లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ లతో చేపట్టిన రహదారుల పనులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. 26 జిల్లాలు పరిశీలిస్తే రోడ్ల పొడవు 166 కిలో మీటర్లు ఉండగా కనిపించిన గుంతలు 6220 సగటున ఒక కిలో మీటర్ కి 37 గుంతలు కనిపిస్తున్నాయి. రోడ్ల పరిస్థితి ఇలా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాల్లో పైనుండి పడి ఎవరో ఒకరు పడి గాయాల పాలవుతున్నారు. 

           గత సీజన్లో వర్షాకాలం వచ్చేసిందని ఇప్పుడు రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం చెబుతూ వచ్చింది వర్షాలు తగ్గాక పనులు చేస్తామని తర్వాత పట్టించుకోలేదు. ఇటీవలే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించి నప్పుడు గ్రామీణ రహదారులు వెయ్యి కోట్లు కోట్లు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. టెండర్లు పిలిచి పాడైన రహదారులు బాగు చేయాలని సీఎం ఆదేశించారు. ఎప్పుడూ టెండర్లు పిలవాలి, ఎప్పుడు పనులు చేయాలి. నెలరోజులు ఆగితే మళ్లీ వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చేశాయ్ అని అధికారులు వాయిదా వేస్తారమో అని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని రహదారులు వేయాలని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com