ఓ ప్రజాస్వామ్యమా... నీ పయనం ఎటు ???
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా వినుతికెక్కిన భారతదేశంలో ప్రజాస్వామ్యమనే మాట పాలకులకు వినరాని మాట అయింది. సమాజంలోని పౌరులంతా స్వేచ్ఛ, సమానత్వాలతో జీవించడానికి అనువైన సంవిధానంగా ప్రజాస్వామ్యాన్ని పరిగణిస్తారు. ఇది కేవలం ఒక భావనే తప్ప ఆచరణలో నిరూపితమైన సత్యం కాదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యం గురించి అటు పాలకులు, ఇటు పాలితులు మాట్లాడుతుంటారు. న్యాయమైన, స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన ప్రజాస్వామ్యం కల్పించదు. కానీ చట్టపరమైన హామీ ఇస్తుందనే భావనతో ప్రజాస్వామ్యం అభిలషణీయమైన వ్యవస్థగా భావిస్తున్నారు. అందువల్లనే ప్రజాస్వామ్యం గురించి, ప్రజాతంత్ర వ్యవస్థల గురించి నొక్కి చెబుతుంటారు. ప్రజాస్వామ్యం కన్నా అత్యున్నతమైన వ్యవస్థ సోషలిజం (సామ్యవాదం). సామ్యవాదం ఒక సుదూర స్వప్నం, ఆచరణసాధ్యం కాని ఆదర్శం అనే భావన పాతుకుపోయింది. కనుక కనీసం ప్రజాస్వామ్యం ఉంటే చాలని సర్దుకుపోయే ధోరణికి ఆమోదం లభించింది. అయితే ఇది కూడా మంట గలిసే రోజులు దాపురించాయి.
స్వేచ్ఛావాణిజ్యకర్తల సిద్ధాంతం :
తొలుదొలుత స్వేచ్ఛా వాణిజ్యకర్తలే ప్రజాస్వామ్యం గురించి పలికారు. ఎల్లలు లేని వాణిజ్య స్వేచ్ఛను ఆశించిన బూర్జువాల కోరికనే ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ, సమానత్వం అనే మాటల వెనుక అంతులేని వాణిజ్య దాహం దాగివుంది. తాము కోరుకునే విశృంఖల వాణిజ్య సరళికి ఆమోదం లభించడం కోసమే సమానత్వం అనే మాటని జోడించారు. సమాజంలో అందరూ స్వేచ్ఛగా మసలుకునే వెసులుబాటు కావాలన్నారు. అందరికీ స్వేచ్ఛ అన్నది అభిలషణీయం. వినసొంపైన పదబంధం. అయితే సంపన్నులకీ, పేదలకీ ఒకేరకమైన స్వేచ్ఛ ఉంటుందా. ఉంటుందని నమ్మబలుకుతారు స్వేచ్ఛా సిద్ధాంతకర్తలు. ఎందుకంటే వారు ‘పెట్టుబడి’ స్వేచ్ఛా ప్రవాహానికి అనువైన మేధావులు. మరో మాటలో చెప్పాలంటే మార్కెట్ల సానుకూల ఆర్థికవేత్తలు. ఆస్తిహక్కు, సంపాదించే హక్కు, సంపదల్ని పోగు చేసే హక్కు వారికి అసలు సిసలు స్వేచ్ఛలుగా కనిపించాయి. ఆ స్వేచ్ఛకు జనుల ఆమోదం లభించాలన్న వ్యూహమే ప్రజాస్వామ్య సిద్ధాంతానికి మూలం.
స్వేచ్ఛ ఎక్కడ? సమానత్వం జాడేది? :
తన పంటని ఎక్కడయినా అమ్ముకునే స్వేచ్ఛ వంద ఎకరాల భూస్వామికీ, రెండు ఎకరాల సన్నకారు రైతుకూ ఒకేవిధంగా ఉంటుందనే మాట వినటానికి బాగుంటుంది. కానీ తన పల్లె పొలిమేరని దాటి పంటని తరలించే స్థోమత లేని రైతులకు దళారీలే దిక్కవుతారు. సకల వసతులున్న భూస్వామికే తప్ప రైతుకు వాణిజ్యస్వేచ్ఛ ఓ ఎండమావి. అలాగే రాయితీలతో, పలురకాల ఆకర్షణలతో వినియోగదారులని ఆకట్టుకునే మాల్స్ మాంత్రికుల ముందు చిల్లరకొట్లు గిరాకీ లేక చతికిలపడటం తెలిసిందే. చిల్లరకొట్టు యజమానికీ, మాల్స్ పెట్టుబడిదారునికీ ఒకేవిధమైన వాణిజ్యస్వేచ్ఛ ఉండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని సుగుణం అని చెబుతారు. అయితే అంతిమంగా బడా పెట్టుబడిదారుల స్వేచ్ఛ సామాన్యుల స్వాతంత్య్రాన్ని, ఎంపిక స్వేచ్ఛనీ హరిస్తుంది. వాణిజ్య స్వేచ్ఛ కోసమే ప్రవచించిన ప్రజాస్వామ్యం ఏకస్వామ్యానికి దారితీసి, అది ఆర్థికవ్యవస్థనే కాదు రాజకీయ వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నది. దరిమిలా ప్రజాస్వామ్యం ఏ రూపం తీసుకున్నదో గత అయిదారేండ్ల పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి. తెలిసిందే. చిల్లరకొట్టు యజమానికీ, మాల్స్ పెట్టుబడిదారునికీ ఒకేవిధమైన వాణిజ్యస్వేచ్ఛ ఉండటం మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని సుగుణం అని చెబుతారు. అయితే అంతిమంగా బడా పెట్టుబడిదారుల స్వేచ్ఛ సామాన్యుల స్వాతంత్య్రాన్ని, ఎంపిక స్వేచ్ఛనీ హరిస్తుంది. వాణిజ్య స్వేచ్ఛ కోసమే ప్రవచించిన ప్రజాస్వామ్యం ఏకస్వామ్యానికి దారితీసి, అది ఆర్థికవ్యవస్థనే కాదు రాజకీయ వ్యవస్థల్నీ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నది. దరిమిలా ప్రజాస్వామ్యం ఏ రూపం తీసుకున్నదో గత అయిదారేండ్ల పరిణామాలు స్పష్టంగా చెబుతున్నాయి.
మౌలిక సూత్రాలకు తిలోదకాలు :
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అన్నారు అబ్రహం లింకన్. కానీ ప్రజల చేత ఎన్నికయిన ప్రభుత్వాలు చివరకు ప్రజాస్వామ్యాన్ని అనేకరూపాల అపహాస్యం పాల్జేస్తున్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లో నెహ్రూ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడంతో మొదలయిన దాడి... అక్కడితో ఆగలేదు. ఆర్టికల్ 356 దుర్వినియోగానికి సంబంధించిన ఉదంతాలు అనేకం. ఫిరాయింపుల చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ బీజేపీ తమది సైతం కాంగ్రెస్ తరహా రాజకీయమని రుజువు చేసుకుంది. గత రెండేండ్లలో కర్నాటక, మధ్యప్రదేశ్‌లలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, అక్కడి ప్రభుత్వాల్ని పడగొట్టడం తెలిసిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని కూలదోయడం సమంజసం కాదని రాజ్యాంగానికి కట్టుబడి నడుచుకునే పార్టీ భావించాలి. కానీ ఎక్కడికక్కడ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని తలపోస్తున్నందున ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు బిడియపడటం లేదు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికయి...
సర్వసత్తాక భారత రాజ్యాంగం, చట్టం ఇచ్చిన వెసులుబాటుతోనే ఆయా పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. అధికారం చేపట్టాక ప్రజాస్వామ్య సూత్రాల్ని విస్మరిస్తున్నాయి. ప్రజాతంత్ర పద్ధతుల్లో నడుచుకోవాల్సిన వ్యవస్థలపై దాడి చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలే గాక అనేక ప్రాంతీయ పార్టీలు ఇదే ధోరణితో వ్యవహరించడం గమనార్హం. మెజారిటీ సీట్లతో అధికారంలోకి వచ్చాక సకల సంస్థలనూ గుప్పిట్లో పెట్టుకుంటారు. తమ మాటకు తిరుగుండరాదన్న ధోరణితో వ్యవహరించడం రివాజయింది. ప్రత్యామ్నాయ ఆలోచనలకు తావుండరాదన్న ధోరణి ప్రజాస్వామ్యానికి విఘాతం. చరిత్రని సైతం వక్రీకరించడాన్ని ఇందులో భాగంగా చూడాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సామాజిక వ్యవస్థని మధ్యయుగాల కాలానికి నడిపించే ఈ కుతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నియిన ప్రభుత్వం చేపట్టడమే విరోధాభాస. ధోరణితో వ్యవహరించడం రివాజయింది. ప్రత్యామ్నాయ ఆలోచనలకు తావుండరాదన్న ధోరణి ప్రజాస్వామ్యానికి విఘాతం. చరిత్రని సైతం వక్రీకరించడాన్ని ఇందులో భాగంగా చూడాలి. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సామాజిక వ్యవస్థని మధ్యయుగాల కాలానికి నడిపించే ఈ కుతంత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నియిన ప్రభుత్వం చేపట్టడమే విరోధాభాస.
ఏకపక్ష ధోరణి :
మన దేశంలో ప్రభువులు పోయినా ప్రభుస్వామ్యం పోలేదు. ప్రజాతంత్ర వ్యవస్థలో ప్రజల తరఫున అధికారం చేపట్టిన వారు ప్రజలకు బద్ధులయి ఉండాలి. అందుకు విరుద్ధంగా అపరిమితమైన అధికారం చెలాయిస్తూ తాము తలచిందే జరగాలన్నట్టుగా రాజుల్లా వ్యవహరిస్తున్నారు. రాజరికంలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల్ని నానాయాతనలు పెడుతున్నారు. బద్ధులయి ఉండాలి. అందుకు విరుద్ధంగా అపరిమితమైన అధికారం చెలాయిస్తూ తాము తలచిందే జరగాలన్నట్టుగా రాజుల్లా వ్యవహరిస్తున్నారు. రాజరికంలో మాదిరిగా ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల్ని నానాయాతనలు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏమాత్రం గౌరవం లేని పాలకపార్టీల వ్యవహారసరళితో చదువుకున్నవారు విసిగెత్తిపోయారు. రాజకీయ వ్యవస్థ మీద విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో ఓటింగ్ శాతం తగ్గిపోతున్నది. అయితే కడుపు కాలినవారు, సమస్యలతో అల్లాడేవారు ప్రభుత్వాల్ని నిలదీస్తారు. తమ బతుకులతో చెలగాటమాడే పార్టీల, ప్రభుత్వాల దుర్మార్గాలపై గళం విప్పుతారు.
ఏది ప్రత్యామ్నాయం? :
ప్రభుత్వాలు రాన్రాను నిరంకుశంగా వ్యవహరించడం ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. అభివృద్ధి పేరుతో ఉదారవాద ఆర్థిక విధానాల్ని ఆమోదించడం, విశృంఖల వాణిజ్యానికి కార్పోరేట్లకు ద్వారాలు తెరవడం, ఫలితంగా క్రమేణా ప్రజాస్వామ్యం హరించుకుపోయింది. గ్లోబలైజేషన్ ప్రకంపనలు ఎంతటి విషపూరిత ఫలితాలనిస్తాయో, ప్రజల గొంతుకల్ని ఉత్తరించే దారుణాలకు ఒడిగడతాయో మొదటి నుంచీ ఈ దేశంలో కమ్యూనిస్టులు హెచ్చరిస్తున్నారు. తమ స్వరాలకు, గళాలకు చోటు నివ్వని మీడియాని పట్టించుకోకుండా ప్రజల్ని చైతన్యపరిచే కర్తవ్యంలో నిమగమై ఉన్నారు. కానీ ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులకు బలం చాలదంటూ, వారిని ఆమోదించే ప్రజల్ని సైతం వారికి దూరం చేసే ధూర్తత్వం చెలామణీ అవుతున్నది. ప్రజల కోసం రాస్తున్నామని చెప్పే కవులు, గాయకులు సైతం ఈ అబద్ధాల వ్యూహాల్లో చిక్కుపడి పాలకవర్గాలతో గొంతు కలపడం మన కాలపు విషాదం. అయినప్పటికీ కాలం నిశ్చలంగా ఉండిపోదు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమ బతుకుల్ని బలిపెట్టే ప్రజాస్వామ్య హంతక ధోరణుల్ని ప్రజలు క్షమించరు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ గళమెత్తి వీధుల్లోకి వచ్చే సమూహాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. నామమాత్రమైన ప్రజాస్వామ్యాన్ని సైతం కబళించే పాలకుల క్రౌర్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకి వెన్నుదన్నుగా నిలిచి ప్రత్యామ్నాయంగా నిలబడే వీరుల కోసం కాలం కలగంటున్నది. ఆ కలని నెరవేర్చే వీరులు ప్రజల్లోంచే వస్తారు. ప్రజలే చరిత్ర నిర్మాతలనే సత్యాన్ని రుజువు చేస్తారు. ఈ రుజువర్తనకు మార్గం సుగమం చేయడం, నిజమైన ప్రజాస్వామ్య ప్రేమికుల, ప్రజాపక్షం నిలిచే వ్యక్తుల, సంఘాల కర్తవ్యం. పాలకవర్గాలతో గొంతు కలపడం మన కాలపు విషాదం. అయినప్పటికీ కాలం నిశ్చలంగా ఉండిపోదు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమ బతుకుల్ని బలిపెట్టే ప్రజాస్వామ్య హంతక ధోరణుల్ని ప్రజలు క్షమించరు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ గళమెత్తి వీధుల్లోకి వచ్చే సమూహాలు ఈ విషయాన్నే చెబుతున్నాయి. నామమాత్రమైన ప్రజాస్వామ్యాన్ని సైతం కబళించే పాలకుల క్రౌర్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ ప్రశ్నలకి వెన్నుదన్నుగా నిలిచి ప్రత్యామ్నాయంగా నిలబడే వీరుల కోసం కాలం కలగంటున్నది. ఆ కలని నెరవేర్చే వీరులు ప్రజల్లోంచే వస్తారు. ప్రజలే చరిత్ర నిర్మాతలనే సత్యాన్ని రుజువు చేస్తారు. ఈ రుజువర్తనకు మార్గం సుగమం చేయడం, నిజమైన ప్రజాస్వామ్య ప్రేమికుల, ప్రజాపక్షం నిలిచే వ్యక్తుల, సంఘాల కర్తవ్యం.
అవినీతి ఆకాశానికి తాకింది పారదర్శకత పాతాళానికి చేరింది :
సంస్థ సర్వే కోసం ఏసియాలోని 17 దేశాల్లో 20,000 మంది ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని వివరించింది. ఇండియాలో లంచగొండితనం ఓ పెద్ద సమస్య అని, ప్రతి నలుగురిలో ముగ్గురు (75శాతం) నమ్ముతున్నారనీ, ప్రతి ఐదుగురిలో ఒకరు (22శాతం) లంచం ఇచ్చి ప్రభుత్వ సంబంధ పనులు చేయించుకుంటున్నారనీ సర్వేలో తేలింది. అవినీతిలో ఇండియా 39శాతం, తరువాత 37శాతంతో కాంబోడియా, 30శాతంతో ఇండొనేషియా ఉన్నాయి. అతి తక్కువ లంచగొండితనం ఉన్న దేశాల్లో 2శాతంతో జపాన్, 10శాతంతో దక్షిణ కొరియా, 12 శాతంతో నేపాల్ ఉన్నాయి. అవినీతి అధికారులను పట్టుకొని, దర్యాప్తు చేసి వెంటనే శిక్ష పడేలా కఠిన చర్యలు, నియమ నిబంధనలు చేపడితే లంచగొండితనం తగ్గుతుందని సూచిస్తున్నారు. సంస్థ సర్వే ప్రకారం కరెప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ జాబితాలో 180దేశాల్లో భారత్ 80వ స్థానంలో ఉన్నదని తేలింది. ఇండియాలో అవినీతి చెదలును అదుపు చేయడానికి ప్రతి ఒక్క బాధ్యతగల భారతీయుడు సహకరించాలని, అవినీతిపరులను సత్వరమే కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంధ సేవా కేంద్రాలుగా రూపాంతరం చెంది సామాన్యుల పక్షపాతిగా మారాలని ఆశిద్దాం. లంచగొండితనమనే భూతాన్ని పొలిమేరలు దాటేదాకా తరిమేద్దాం.
అధికారాన్ని నిలబెట్టుకోడానికి చాలా దేశాలలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధానాలను అనుసరిస్తున్నారని ప్రొఫెసర్ టామ్ గిన్స్బర్గ్ చెప్పారు. రాజ్యాంగ సవరణలు చేయడం, ప్రభుత్వంలోని ఇతర విభాగాలలో జోక్యం చేసుకోవడం, బ్యూరోక్రసీని తన నియంత్రణలో పెట్టుకోవడం, పత్రికా స్వేచ్ఛకు అంతరాయం కలిగించడం, ఎన్నికలను ప్రభావితం చేయడంవంటివి వీటిలో కొన్ని.
ఓ ఓటరా... ప్రజాస్వామ్యంలో నీకున్న హక్కుని వినియోగించుకో. పోరాడు. అవసరం అయితే తిరగబడు. మౌనంగా మాత్రం ఉండకు...
By
చంద్రశేఖర్
ట్విట్టర్ ఐడి : @chandrasekarJSP
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com