న్యూస్ ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీకి సీయం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామానికి చెందిన జనసైనికుడు ఎన్వీ రమణ హైదరాబాదులోని పెద్దమ్మతల్లి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 3న ఏటుకూరులోని సీతారామచంద్రస్వామి, సాయి బాబా, భజరంగబలి, అంబేద్కర్ విగ్రహాలకు పూజలు నిర్వహించి 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. గురువారం పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి పవన్ కళ్యాణ్ ని కలుస్తానని తెలిపారు. మండల జనసేన అధ్యక్షులు పర్నే శివారెడ్డి, లింగస్వామి, భాస్కర్, మహేశ్, శివ తదితరులు స్వాగతం పలికారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com