నూజివీడు ( జనస్వరం ) : నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ ,యర్రంశెట్టి రాము, బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్ గార్ల సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పార్టీ సిద్దాంతాలు నచ్చి నామాల జగదీష్ , షేక్ షబ్బీర్, వారి మిత్రులు, బంధువులు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, యర్రంశెట్టి రాము, బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్ గార్లు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ పేదల గొంతుక అని, ఎక్కడ ఏ సమస్య ఉన్న ముందుగా స్పందించేది జనసేన పార్టీ అని అన్నారు. నియోజకవర్గములో ఏ సమస్యలు ఉన్నా నేను ముందు ఉండి పోరాడుతాను అని అందరిలా మాటలు చెప్పి షో చెయ్యడం నాకు రాదు అని, ప్రజా సమస్యలపై నా గొంతుక ఎప్పుడు వినిపించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com