నూజీవీడు ( జనస్వరం ) : ముసునూరులో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు వివిధ సమస్యల మీద ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారికి అర్జీలు అందజేశారు. వీటిలో ముఖ్యంగా నూజివీడు నుండి ఏలూరు కి వెళ్ళే అర్ అండ్ బి రహదారి నిర్మాణం, బలివేలో తమ్మిలేరు మీద బ్రిడ్జి నిర్మాణం, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం, రమణక్కపేట పశు వైద్యశాల శిధిలావస్థ గురించి వివరించారు. ముసునూరు, గోపవరం గ్రామాలలో జగనన్న కాలనీలకు స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముసునూరు మండల జనసేన నాయకుల గిరి గోపి, పల్లి నాగరాజు, బర్మా సాయి, అనిల్ ,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com