
నూజివీడు ( జనస్వరం ) : ప్రపంచానికీ శాంతిని,ప్రేమను పంచిన దయామయుడు ప్రభువు ఏసుక్రీస్తు సెమీ క్రిస్మస్ వేడుకలను ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరం గ్రామంలో జనసేన నాయకులు కమ్మిలి వెంకటేశ్వరరావు, దయాకర్ గారి అధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు దైవ జనులు పాస్టర్ శ్రీనివాస్ గారు ప్రభువు బోధనలు, ప్రార్థన గీతాలు ఆలపించారు. తదుపరి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు గారు, స్థానిక యువతతో కలిసి ప్రజలకు మంచి చేస్తున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయించి ప్రజలందరికీ మంచి జరగాలని అలాగే నియోజకవర్గ జనసేన తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఇ వేడుకల్లో ఆగిరిపల్లి మండల జనసేన వైస్ ప్రెసిడెంట్ పిట్ల విజయ్ బాబు, కార్యవర్గ సభ్యులు కొండిసెట్టి శ్రీనివాస్, జన్యువుల అనీల్, చింతల రంగారావు,కొవ్వలి శేఖర్, ప్రవీణ్, విజయ్,మణి,జాన్సన్, బాగ్యరాజు, వీరన్న, సంతోష్, నవీన్, రాకేష్ , జలసూత్రం గోపాల్, రాణిమేకల లోకేష్ మరియు స్థానిక సురవరం, కొమ్మూరు, వడ్లమాను గ్రామాల నుండి జనసేన నాయకులు పాల్గోన్నారు.