GHMC ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థులకు అండగా ఉండేందుకు రూ.1,00,000 ఆర్థిక సహాయం అందించిన NRI జనసైనికుడు శ్రీను
ఇంకో 12 రోజుల్లో తెలంగాణ గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి సారిగా జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో ఆసక్తి గల అభ్యర్థుల నుండి బయోడేటాను స్వీకరించారు తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు. ఈసారి జనసేన పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి నిలవడంతో అందరి చూపే అక్కడే ఉంది. ఈ ఎన్నికలను కూడా జనసేన అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే NRI జనసైనికుడు శ్రీను గారు పార్టీ కోసం రూ. 1,00,000 ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సహాయాన్ని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ప్రజాదారణ ఉండి ఎన్నికల్లో తగిన ఖర్చు పెట్టే స్థోమత లేని 5 గురు అభ్యర్థులకు, ఒక్కొక్కరికి 20,000 వేల రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు. గత 6 నెలల కాలంలో కూడా పార్టీకి తన వంతుగా 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీను గారు మాట్లాడుతూ స్వచ్చమైన సమాజం రావాలంటే నిజాయితీ పరులైన, సమాజానికి సేవ చేయాలన్న అంకిత భావం గల నాయకులు కావాలన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తూ, సమాజ సేవ చేస్తున్నాని అన్నారు. అలాగే ప్రతి జనసైనికుడు కూడా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.