
ఇప్పటం, ( జనస్వరం ) : ఇప్పటం గ్రామంలో ఇళ్ళ కూల్చి వేతకు గురైన కుటుంబాలకు ఒక్కక్కరికి రూ. 1లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందజేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కి చేయూతగా మేము సైతం అంటూ కెనడా జనసేన టీం రూ. 3,33,333 లక్షలు జనసేన పార్టీకి విరాళంగా అందజేసారు. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మంచి పరిపాలన, మార్పు రావాలంటే అది పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని అన్నారు. కళ్యాణ్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సప్త సముద్రాలు దాటి వృత్తిరీత్యా మేము మా విధులను నిర్వర్తిస్తూనే, ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం నిరంతరం జనసేనపార్టీకి అండగా ఉంటామని తెలియజేశారు. రానున్న రోజుల్లో మా కెనడా టీమ్ తరుపున మరిన్ని కార్యక్రమాలను చేయాలని సంకల్పించామన్నారు.