విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ ఆవిర్భావ సభకు మద్దతు తెలిపి స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామ ప్రజల మీద ప్రతీకారంగా వారి ఇళ్లను కూల్చి వేసిన వైసీపీ ప్రభుత్వం అని విజయనగరం జనసేన నాయకులు అన్నారు. ఇప్పటం వెళ్లకుండా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందే నిలువరించే ప్రయత్నం చేసినందుకు నిరసనగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంచార్జీ పాలవలస యశస్వి గారి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరంలో కోట జంక్షన్ వద్ద జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయనగరం కార్పొరేట్ అభ్యర్థి మతా గాయత్రి, కృష్ణవేణి, ప్రచార కమిటీ కార్యదర్శి బాబు పాలూరు, మోపాడ అనిల్, లోకల్ బాయ్ ప్రసాద్ రామచంద్ర రాజు , దాసరి యోగేష్, బొబ్బడి చంద్రు నాయుడు, ఎర్నాగుల చక్రవర్తి, పతివాడ చంద్ర శేఖర్, చరణ్, రాజీవ్లో, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com