
అరకు ( జనస్వరం ) : అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం వాలసి పంచాయతీ రాళ్ళగడ మరియు నిమ్మలపాడు ప్రాంతంలో పర్యటించిన జనసేన నాయకులు. మైనింగ్ అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న పీసా చట్టాన్ని మరియు సమత తీర్పును వ్యతిరేకంగా మైనింగ్ మాఫియా మైనింగ్ తీస్తున్నారు. సమత తీర్పు ప్రకారంగా 5వ షెడ్యూల్ ప్రకారముగా (ఏపీఎండీసీ) వారు అక్కడున్న ప్రజలను మరియు మౌలిక ఆర్థిక విషయాలను వ్యవసాయం సేసి జీవించిన వారిని ఏ మాత్రం నష్టపరిహారం గానీ సమత జడ్జిమెంట్ తీర్పు వచ్చిన విధంగా అక్కడున్న మైనింగ్ జరగడం లేదు. వీరికి న్యాయం చేయవలసిన గిరిజన చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధుల మీద ఉన్నదన్నారు. అధికార పార్టీలో ఉండి గొప్పలు చెప్పుకోవడం కాదు వాస్తవాలు తెలుసుకొని భారత రాజ్యాంగం పరంగా 5వ షెడ్యూల్లో ఉన్న హక్కులను కాపాడాల్సిన బాధ్యత వీరిపై ఉన్నదని జనసేన పార్టీ తరుపున తెలియజేస్తున్నామన్నారు. 5వ షెడ్యూల్లో ఉన్న హక్కులను కాలరాస్తున్న (ఏపీఎండీసీ) మరియు దాని వెనక ఉన్న మైనింగ్ మాఫియా వారిపై పోరాటానికి జనసేన పార్టీ సిద్ధముగా ఉన్నదన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్ మురళి మాట్లాడుతూ 112.. సంపూర్ణ నిషేధం ఏది లేనిపక్షంలో 298. అధికరణం కింద 5వ షెడ్యూల్ ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ నిర్వాణ పరిశ్రమ ఉండే ప్రాంతంలో రోడ్డు కమ్యూనికేషన్ సదుపాయాలు మరియు గిరిజనులకు శుభ్రమైన నీటి సరఫర, ప్రాథమిక సెకండరీ విద్యను ఉచితంగా అందించేందుకు పాఠశాలల ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజనుల ఉద్యోగావకాశాలను పంచేందుకు వృత్తి శిక్షణకు సదుపాయాలు. తమ సంస్థ/ ఫ్యాక్టరీలో గిరిజనులకు వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించాలన్నారు. షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు ఉచితమైన వైద్య సదుపాయం, చికిత్స అందించేందుకు ఆస్పత్రులు శిబిరాలు ఏర్పాటు చెయ్యాలి. పరిశుద్ధ నిర్వహణ షెడ్యూల్ ప్రాంతంలోని నిర్దిష్ట ప్రదేశాలలో గిరిజనులకు గృహ నిర్వహణం ఆయా సమస్త/ పరిశ్రమల వార్షిక బడ్జెట్ లో పై పనులకు అయ్యే వ్యయం అంతర్భాగంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా అనంతగిరి మండలం వీర మహిళ రత్న ప్రియ, మండల నాయకులు మంగళ పంచాయతీ మాజీ సర్పంచ్ ధర్మన్న ఎస్ తిరుపతి, సుబ్బరాజు, చంపి సోమన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.