మదనపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును ఖండిస్తూ రోడ్ పై నిరసన తెలిపిన జనసేన నాయకులు. తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడమైనది. వారు మాట్లాడుతూ విశాఖలో జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే, ఆయనను మా నాయకులను, వీర మహిళలను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని అన్నారు. శాంతియుతంగా, ట్రాఫిక్ లకు అడ్డు లేకుండా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టమేముందని, ఒక పక్క పోలీసులకు చెప్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని అన్నారు. విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో కూడలి క్లోజ్ చేయటం ప్రజలకు ఇబ్బంది పెట్టడం, ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధిస్తారా అని, ఈ ప్రభుత్వం తీరు మార్చుకొని ఎడల ఎంతటి ఉద్యమానికైనా జనసేన పార్టీ సిద్దమని అన్నారు. పోలీసులు ఐ.పి.సి సెక్షన్ల ను మాని వై.సీ.పీ సెక్షన్ల ను ఆచరిస్తున్నారని, పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారు. ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఇక మూడు నెలలు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని వైసిపి నేతలతో సహా పోలీసులు కూడా గుర్తుంచుకోవాలని, తక్షణమే మా నాదేండ్ల మనోహర్ కి నాయకులకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు రామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత, సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు, నాయకులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, రామిశెట్టి నాగరాజు, థరణి, వినయ్ కుమార్ రెడ్డి, పాల్గున స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సుప్రీం హర్ష మహిళా సీనియర్ నాయకురాలు మల్లికా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com