– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 268వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పలువురు దివ్యాంగులు పింఛన్ అందట్లేదనే అంశం తెలిసిందని, వార్డు సచివాలయాల్లో సంప్రదిస్తే దివ్యాంగుల గుర్తింపు సదరం ధ్రువపత్రాలను తెమ్మంటున్నారని కానీ వారు ఎన్నో వ్యయప్రయాసలను ఓర్చుకుని వైద్య కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ధ్రువపత్రాలను ఇవ్వడం లేదని, కేవలం పింఛన్లు ఇవ్వాల్సి వస్తుందనే కారణం చేతే ప్రభుత్వం ఇలా చేస్తోందని దుయ్యబట్టారు. దివ్యాంగుల ఉసురు కూడా ఈ ప్రభుత్వం పోసుకుంటోందని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం దిక్కుతోచని స్థితిలో ఉందనేందుకు ఈ అంశం ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే పవనన్న రావాలని, ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.