గృహ నిర్బంధం, బలవంతపు అరెస్టులకు నూజివీడు నియోజకవర్గ బీజేపీ, జనసేన నిరసన
ఛలో అమలాపురం కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలి వెళుతున్న పార్టీ శ్రేణులను గృహ నిర్బంధం చేయటం, బలవంతపు అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తూ నూజివీడు నియోజకవర్గ బీజేపీ, జనసేన నాయకులు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉభయ పార్టీల నేతలు అంతర్వేది ఘటనలో అరెస్టు కాబడిన నాయకులను, హిందూ సమాజ సంస్థల ప్రతినిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో అమలాపురం వెళుతున్న బీజేపీ ఇంచార్జ్ నూతక్కి వేణు, జనసేన నాయకులు కొల్ల కాంతారావు పాశం నాగబాబు, ఎర్రంశెట్టి రాము, అబ్బూరి రవికిరణ్ లను ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అడ్డుకుని స్టేషన్ కి తీసుకువెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. అదేవిధంగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, పట్టణ అధ్యక్షుడు ఎమ్. రాజశేఖర్ మండల అధ్యక్షులు నక్కా శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు, గోగినేని అప్పారావు, మాదల వెంకటేశ్వరరావు, గెద్దల ఆశీర్వాదం వెంట్రపాటి వేణు తదితర నాయకులను బలవంతపు అరెస్టులు చేసి స్టేషన్ కు తరలించడాన్ని అప్రజాస్వామికంగా పేర్కొన్నారు. తక్షణమే అరెస్టు అయిన నాయకులను విడుదల చేయాలని, నిర్బంధ చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com