Logo
Date of Publish : 17 February 2022, 5:41 pm
Editor : Sake Naresh

అమలాపురం వద్దు – రాజమహేంద్రవరం ముద్దు : జనసేన నాయకులు వేగుళ్ళ రాజబాబు

   మండపేట, (జనస్వరం) : మండపేట ప్రజలు కోరుకునే రీతిలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలోనే మండపేటను విలీనం చేయాలని జనసేన నాయకులు వేగుళ్ళ రాజబాబు డిమాండ్ చేశారు. జె.ఏ.సి ఆధ్వర్యంలో మండపేట పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జె.ఏ.సి దీక్ష శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన మహార్యాలీలో ఆయన పాల్గొని, ఎం.ర్.ఓ గారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాలు ఏకమై జె.ఏ.సి గా ఏర్పడి వినతులు ద్వారా కార్యక్రమలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో మండపేట కలిస్తే కలిగే ప్రయోజనాలు వివరించారు. మండపేట ప్రజల సౌకర్యాలను పరిగణంలోకి తీసుకోని ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. జె.ఏ.సి కి జనసేనపార్టీ తరుపున ఎల్లప్పుడూ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాలు, విద్యార్థులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com