★ నిలదీసి ప్రశ్నించినందుకు డాక్టర్ కందులపై సస్పెన్స్ వేట
★ బడ్జెట్ తీర్మాన సమయంలో కమిషనర్ బాధ్యతరాహిత్యం
★ వైసీపీ కార్పొరేటర్లకు డబ్బులు వచ్చే పనులకు సంబంధించి బడ్జెట్ రూపకల్పన
★ కౌన్సిల్లో జనసేన వాయిస్ వినిపించిన డాక్టర్ కందుల
★ మద్దతుగా నిలిచిన జనసేన కార్పొరేటర్లు
★ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
విశాఖపట్నం ( జనస్వరం ) : జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మంగళవారం అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వాద ప్రతిపాదనలు జరిగాయి. ముఖ్యంగా బడ్జెట్ తీర్మాన విషయంలో జనసేన కార్పొరేటర్లు మేయర్ హరి వెంకట కుమారిని, కమిషనర్ సాయి కాంత్ సమస్యల పరిష్కారం కోసం పదేపదే నిలదీసి ప్రశ్నించారు. బడ్జెట్ విషయంలో మేయర్ ఏక పక్షంగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉండటంపై జనసేన కార్పొరేటర్లు అది సరైనది కాదంటూ తమ వాదన వినిపించారు. అదే సమయంలో కమిషనర్ అక్కడినుంచి వెళ్లిపోవడంపై కూడా చర్చ జరిగింది. దీనిపై జనసేన 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తన గళం విప్పారు. విశాఖపట్నం అభివృద్ధికి సంబంధించి కీలకమైన బడ్జెట్ తీర్మానం జరుగుతున్న సమయంలో కమిషనర్ మధ్యలో అలా వెళ్లడం బాధ్యత రాహిత్యమని విమర్శించారు. విషయంలో మేయర్ కూడా మద్దతు పలకడం విచారకరమని అన్నారు. బడ్జెట్లో కూడా వైసిపి కార్పొరేటర్లు సంబంధించి పనులు ఎక్కువ జరిగే విధంగా ఉండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా అన్యాయం అంటూ చెప్పారు. పోడియం వద్దకు వెళ్లి నేరుగా మేయర్ తో వాగ్వాదానికి దిగారు. మేయర్ ను, కమిషనర్ను పెట్టే విధంగా డాక్టర్ కందుల ప్రశ్నిస్తూ ఉండటంతో మేయర్ అతనిని సస్పెండ్ చేశారు. అయితే కౌన్సిల్ సమావేశంలో ఇంత ఘర్షణ వాతావరణం నెలకొంటుందని అధికార పార్టీ సభ్యులు ఊహించలేదు. బడ్జెట్ తీర్మానం సునాయాసంగా జరుగుతుందని భావించారు. ప్రతిపక్షాల నుంచి పెద్దగా ఒత్తిడి రాదని అనుకున్నారు. కానీ జనసేన మాత్రం బడ్జెట్ పై తీవ్ర అభ్యంతరం చెప్పింది. ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాత్రం అసలు ఎక్కడ తగ్గకుండా ప్రజల పక్షాన తన గళాన్ని విప్పారు.
★పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయండి..
తమ సమస్యల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికులు గత 15 రోజుల పైగా తమ ఆందోళన చేపడుతుంటే మేయర్, కమిషనర్లు పట్టించుకోకపోవడం విచారకరమని డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. కౌన్సిల్లో ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మేయర్ నేరుగా బడ్జెట్ తీర్మాన సమయంలో పారిశుధ్య కార్మికుల సమస్యలు లేవనెత్తు వద్దంటూ చెప్పడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మేయర్ వ్యాఖ్యలపై డాక్టర్ కందుల నాగరాజు మండిపడ్డారు. తాము పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు. పండగ సమయంలో కూడా వాళ్లు రోడ్డెక్కి ఆందోళన చేపడుతున్నారని ఇది మేయర్ కమిషనర్లుకు కనిపించదా అంటూ నిలదీశారు. ఏదైనా సరే ప్రజా సమస్యలపై జనసేన పోరాటం ఆగదని చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com