- పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 87వ రోజున 51వ డివిజన్ దండువారి వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకులు నేడు నగర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి సమస్యలమయం చేసారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రెడ్డి ఒక్కో ఎమ్మెల్యేకి 20 లక్షల రూపాయలు కేటాయించి తమ నియోజకవర్గ పరిధిలోని సచివాలయాల స్థాయిలో సమస్యలను పరిష్కరించమంటే ఆ నిధులను కూడా వైసీపీ ప్రక్కదారి పట్టించే పరిస్థితి నగరంలో కనపడుతోందన్నారు. స్పందన అంటూ ఆడంబరంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమానికి ఇప్పుడు దిక్కు, దిశా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టరేట్ నుండి వార్డు సచివాలయాల వరకు కుప్పలు తెప్పలుగా స్పందన పిటీషన్లు పరిష్కారం కాకుండా మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పై చిత్తశుద్ధి లేదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com