
రైల్వేకోడూరు, (జనస్వరం) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం అన్నమయ్య జిల్లా అని ప్రకటించి హెడ్ కోటర్స్ ఏమో రాయచోటిలో ప్రకటించడం ఇది ఎంతవరకు న్యాయం అర్థం కావట్లేదు. కనీసం రైల్వేస్టేషన్ సరైన నీటి వసతి రాయచోటి జిల్లా హెడ్ కోటర్స్ గా ప్రకటించిన బదులు అన్ని వసతులు ఉన్నా అన్నమాచార్యుడు సంకీర్తనలో రచించిన రాజంపేటనీ జిల్లా హెడ్ కోటర్స్ గా ప్రకటించాలని అలా రాజంపేట హెడ్క్వార్టర్స్ అయినట్లయితేనే రైల్వే కోడూరు అన్నమాచార్య జిల్లాలో ఉంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అలా చేతగాని పక్షంలో దయచేసి మా రైల్వే కోడూర్ ని శ్రీ బాలాజీ జిల్లాలో కలిపి మా రైల్వేకోడూరు నియోజకవర్గానికి న్యాయం జరగాలని కోరుకుంటూ. లేదా జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని అర్హతలు, వనరులు, వసతులు మా రైల్వేకోడూరు నియోజకవర్గంలో కలవు. జిల్లా అభివృధికి అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మంగంపేట బైరైటీస్ గనులు మా రైల్వేకోడూరు నియోజకవర్గంలో కలవు. నీటి వసతికి కావాల్సిన వాగేటికోన, గొటిమానుకోన, చాకిరేవ కోన వంటి చిన్న, పెద్ద రిజర్వాయర్లు చాలా కలవు. నీటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రెండు వరుసల రైలు మార్గం అనువుగా ఉంది. కృష్ణపట్నం పోర్టు, సరుకు రవాణాకు అనువైన రైలు మార్గం మా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె నుండి ఉంది. చైన్నై పోర్టుకు అనువైన జాతీయ రహదారి మార్గం ఉన్నా, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్(తిరుపతి) మా రైల్వేకోడూరు అతి సమీపంలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వసతులు, వనరులు, అర్హతలు మా రైల్వేకోడూరుకు కలవు. కావున మా రైల్వేకోడూరును జిల్లా ప్రధాన కేంద్రంగా ప్రకటించాలని, లేదా శ్రీ బాలాజి జిల్లాలో కలిపితే మా రైల్వేకోడూరు అభివృధి చెందుతుందని రైల్వే కోడూర్ జనసేన పార్టీ యువ నాయకుడు అంకిపల్లి అఖిల్ కళ్యాణ్ మాట్లాడుతూ వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలని దయచేసి ప్రభుత్వాన్ని రైల్వే కోడూరు జనసేన పార్టీ ద్వారా విన్నవించుకుంటున్నాముని తెలియజేశారు.