Logo
Date of Publish : 01 August 2022, 4:56 pm
Editor : Sake Naresh

నెల్లూరు సిటీలో జనసేన పార్టీ గెలుపుని ఆపడం ఎవ్వరి తరం కాదు : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

               నెల్లూరు సిటీ  ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 77వ రోజున 40వ డివిజన్ మూలాపేటలోని కోనేటిమిట్ట, కోనేరు ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాటలో భాగంగా మైపాడు రోడ్డుకి అనుసంధానంగా ఉన్న 3, 4, 5 డివిజన్లను పూర్తి చేసి మూలాపేట ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న 39, 40 డివిజన్ల పర్యటనలో ప్రజాస్పందన ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. ముఖ్యంగా మూలపేటలోని అనేక ఇళ్ళలో ప్రజలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని తమ ఇంటి సొంత బిడ్డగా భావిస్తున్నారని, వారి ఆప్యాయతను తమపై చూపిస్తున్నారని అన్నారు. ప్రజాబాటలో భాగంగా పలు వీధి కూడళ్ళలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి తాము మాట్లాడుతుంటే అదంతా విని, మరుసటి రోజున ఏఏ అంశాలు మాట్లాడాలో ప్రజలే తమకు వివరిస్తున్నారని, ప్రజలు వైసీపీ ప్రభుత్వ మోసపూరిత తీరుపై విసిగిపోయారని కేతంరెడ్డి తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, పవనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆకాంక్ష, నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై తమ పోరాట పటిమను ప్రజలందరూ గుర్తించి ఆశీర్వదిస్తున్నారని, రేపటి రోజున ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పొత్తులు ఉన్నా లేకున్నా, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుని ఆపడం ఎవ్వరి తరం కాదని కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com