అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యువశక్తి కార్యక్రమం ఎంతో విజయవంతం అయిన సందర్భంగా ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శించే అర్హత లేదు. ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు ఎన్నికల్లో ఎక్కడ ఓటమిపాలవుతారు అని భయంతో పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువశక్తి కార్యక్రమం ద్వారా వంద మంది యువతి యువకులు వాళ్ల స్థానికంగా ఉండే సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి అలాగే రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువచ్చి రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయా అని అందరికీ అర్థమయ్యే విధంగా యువశక్తి కార్యక్రమం ద్వారా నిరూపితం అయింది. నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు. సినిమాల ద్వారా రోజుకి కోటి రూపాయలు సంపాదించే అవకాశం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అవన్నీ వదులుకొని ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం… వచ్చే 2024 ఎన్నికల్లో ఎక్కడ ప్రజలు అవగాహన ఏర్పడి వైసిపి పార్టీకి ఓటు వేయరు అని భయం పట్టుకొని జనసేన పార్టీని ఎలాగైనా అణగదొక్కాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అరకొరగా సంక్షేమ పథకాలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే సమస్యలు లేవు అన్నట్లు ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు వైసీపీ వాళ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు గ్రామాలలో కనీస మౌలిక వసతులు కూడా లేవు ఈ వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఏ శాఖలో ఏమి ఉంటాయో కూడా తెలియని మంత్రులు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటమే గాని ఆ శాఖకు సంబంధించి అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేదు. వైసిపి మంత్రులకు ఏదైనా సమస్యలు చెప్పుకుంటే వారిపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సామాన్య ప్రజల పైన ఎంతసేపు సింగిల్ గా పోటీ చేస్తాం మేము అని అనటమే గాని ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు మద్యం ఇవ్వము అనే మాటే మాట్లాడరు వైసిపి నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మొదటి స్థానం అభివృద్ధితో లాస్ట్ స్థానం తీసుకొని వచ్చాయి ఈ వైసీపీ ప్రభుత్వం. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని, వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కచ్చితంగా ప్రభుత్వం స్థాపించి ప్రజలకు మంచి పరిపాలన అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని తెలిపారు.