తిరుపతి ( జనస్వరం ) : టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రం మనదే కావాలన్నారు ఉమ్మడి చిత్తూరుజిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన బలిజ ఉద్యోగుల, మేధావుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని 2024 కేలండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కులాన్ని ప్రేమిస్తూనే ఇతర కులాలను గౌరవించాలన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలన్నారన్నారు. అన్ని సామాజిక వర్గాలతో కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. మాటల్లో, భాషలో ఎక్కడా తేడా లేకుండా ఇతర సామాజిక వర్గాలను గౌరవించాలన్నారు. ఇంట్లో దేశ నాయకులు మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజులాంటి మహనీయులంతా “తరతరాల కోసం సంపాదిస్తే రెండో తరానికి గుర్తుండదు. ఏమైనా చేద్దాం ఈ తరానికి” అనే ఆలోచనతో తాము పోరాటాలు చేశారన్నారు. త్యాగంతో, నిస్వార్ధంగా పనిచేయడం వల్లే వాళ్లను ఇంకా గుర్తించి గౌరవిస్తున్నామన్నారు. అలాంట గుణగణాలు ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన అంతటి మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా అవన్నీ వదులుకొని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రతి మనిషి జీవితంలో రాజకీయం కూడా భాగమై పోయిందన్నారు. రాజకీయం మనకెందుకులే అనుకోకుండా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. తిరుపతిలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా గెలిపించుకుంటామన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులు తమ స్వార్ధం కోసం కాకుండా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గెలిపించేందుకు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. సమర్ధులు మాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్ధులు రాజ్యాలు ఏలుతారని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెబుతూ ఉంటారని, అందుకే మేధావులు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. ఒక్కో మేధావి అయిదు వందల ఓట్లను ప్రభావితం చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు వూక విజయ్ కుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, డా. సురేంద్ర, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, జనసేన రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర కార్యక్రమాల కోఆర్డినేటర్ పగడాల మురళి, రాయలసీమ మహిళా కోఆర్డినేటర్ ఆకుల వనజ, జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి ఆనంద్, హేమకుమార్, బాటసారి, చంద్రగిరి పాయింట్ అఫ్ కాంటాక్ట్ ఇంచార్జి దేవర మనోహర్, జిల్లా యువనాయకులు యువరాజ్ రాయల్, నగర ఉపాధ్యక్షులు పార్ధు, నగర కార్యదర్శులు కిరణ్ కుమార్, మనోజ్, గౌస్ బాషా, దిలీప్, అర్బన్ అధ్యక్షులు జనసేన సాయి, జనసైనికులు మోహిత్, తదితరులు పాల్గొన్నారు.