Logo
Date of Publish : 13 February 2023, 3:51 pm
Editor : Sake Naresh

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాం, గెలుస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 273వ రోజున 47వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ ప్రాంతంలో డివిజన్ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం నడుమ ఘనంగా ప్రారంభమైంది. డివిజన్లో కార్యక్రమ ప్రారంభం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేతంరెడ్డి వినోద్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవనన్న ప్రజాబాట కార్యక్రమం పట్ల నియోజకవర్గ ప్రజలు చూపుతున్న అపూర్వ ఆదరణ మరువలేనిదన్నారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల ప్రేమకు, పవనన్న ప్రభుత్వం ఏర్పడాలనే ప్రజల ఆకాంక్షకు ఇది నిదర్శనం అని అన్నారు. రానున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది తామేనని, ఎవరిన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి గెలుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పావుజేన్ని చంద్ర శేఖర్ రెడ్డి, వెంకటేష్, అమంచర్ల శ్రీకాంత్, శిరీష రెడ్డి, కుసుమ, తేజ, షాను, లక్ష్మణ, పురుషోత్తం, చలం, కార్తిక్, జీవన్, వరప్రసాద్, బాలు, సీయోను, పవన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com