చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండలం, సురేంద్ర నగర్ గ్రామపంచాయతీ సురేంద్ర నగరం హెచ్ డబ్ల్యు మరియు ఎ.ఏ. డబ్ల్యూ గ్రామస్తులు తాగునీటి కోసం అగచాట్లు పడుతున్న వైనం చాలా దారుణం అని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుండి తాగునీరు మోటారు ఆన్ చేయడానికి చాలా దూరం వెళ్లి వంతులవారీగా గ్రామస్తులు ఇబ్బందులు వర్ణనాతీతమని తెలిపారు. ఊరికి ఉత్తరాన ఎంతకాలం ఈ అగచాట్లు, అసలే నీళ్లు, ఆపై కరెంట్ పాస్ అయితే ఆ గ్రామస్తులు పరిస్థితి అధోగతి పాలు కాకతప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి మోటారు ఆన్ చేసి రావడం, గత 35 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని హెచ్చరించారు. సురేంద్ర నగరం గ్రామ ప్రజల అవస్థలు చాలా బాధాకరం, దయనీయమైనది. కొన్నిసార్లు వర్షాభావం వల్ల పైపుల గుండా మంచి నీళ్లు రాక బురద నీరు వస్తూ ఉండటం గమనార్హం. అనారోగ్యకర నీటిని సేవించడం ఆరోగ్యానికి హానికరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికి దూరంగా చెరువులో అమర్చిన స్టార్టర్ ను గ్రామం దగ్గర్లో ఏర్పాటు చేస్తే ఆటు దూరం తగ్గిపోయి ఇటు గ్రామస్తులకి సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. చెరువులో ఉన్న బోరు నీటి ద్వారా గ్రామస్తులు ఆధారపడకుండా శాశ్వతంగా మరొక కొత్త బోరు నిర్మాణం చేపట్టాలి. అధికారులు, అధికార పార్టీ నాయకులు జనవరి 25 వ తేదీ లోపు ఈ సమస్యను పరిష్కరించక పోతే 26వ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున మండల ప్రజా పరిషత్ ఆఫీసు జనసేన పార్టీ తరఫున నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల సంయుక్త కార్యదర్శి సాయి కుమార్, జనసైనికులు శ్రీనివాసులు, పవన్ కుమార్, బాలాజీ, చరణ్ కుమార్, గణేష్, తరుణ్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com