లేటరైట్ తవ్వకాలు వద్దే వద్దు – నర్సీపట్నం జనసేన నాయకులు

నర్సీపట్నం

      నర్సీపట్నం, (జనస్వరం) :  జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ రాజా నా వీర సూర్య చంద్ర గారి వద్దకు సరుగుడు మరియు సిరిపురం మరియు అసనగిరి మరియు సుందరపు కోట గిరిజనులు నర్సీపట్నం జనసేన పార్టీ ఆఫీసు వద్దకు వచ్చి లేటరైట్ తవ్వకాలకు మేము వ్యతిరేకంగా ఉన్నాము. మాకు మద్దతుగా జనసేన పార్టీ అండగా ఉండాలని కోరడం జరిగింది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు   లేటరైట్ క్వారీ వద్దకు నర్సీపట్నం నియోజకవర్గం జనసేన టీం తో పరిశీలన కోసం వెళ్లడం జరిగిందని క్వారీ కి సమీపంలో ఉన్న గ్రామాలు సుందరపు కోట, అసనగిరి మరియు సిరిపురం గ్రామాల గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని తదుపరి గిరిజనులతో కలిపి లేటరైట్ తవ్వకాలు జరిగే ప్రదేశానికి వెళ్లి  గిరిజనులతో పాటుగా ధర్నా చేయడం జరిగిందని సూర్య చంద్ర గారు  తెలిపారు. లేటరైట్ క్వారీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే అస నగిరి గ్రామస్తులు తమ ఆవేదన వెలిబుచ్చారు.లేటరైట్ తవ్వకాల వల్ల క్రింది గ్రామాల కంటే మా గ్రామానికి ఎక్కువ ముప్పు ఉందని తాగునీటికి ఇబ్బందులు తప్పవని కాలుష్యంతో పంటల దిగుబడి తగ్గిపోతుందని అటవీ ఫలసాయం ఇక అందే పరిస్థితి లేదని ప్రజల జీవితాల పైన పర్యావరణ ప్రభావం చూపించే ఇలాంటి క్వారీలు నిర్వహించవద్దని గిరిజనులు జనసేన పార్టీ వారితో మాకు మద్దతుగా ఉండాలని విన్నవించుకున్నారు. ఇదివరకే ఒక క్వారీ లీజ్ కి ఇస్తే మా గ్రామస్తులందరూ వ్యతిరేకించి ఆ క్వారీ లీజులు రద్దు చేయించాము. మరల ఈ ప్రదేశంలో తవ్వకాలు జరుగుతుంటే మేము పడిన శ్రమ అంతా వృధా అయిపోయిందని ఆవేదనతో జనసేన పార్టీ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర గారి వెంట నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి మరియు జనసేన ముఖ్య నాయకులు కూడా గిరిజన గ్రామాలను సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని లేటరైట్ తవ్వకాల వల్ల వారు ఎంత నష్టపోతారు వాటికి సంబంధించిన విషయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి లేటరైట్ తవ్వకాలు జరపకుండా మాకు సహాయపడాలని అక్కడ గిరిజనులు విన్నవించుకున్నారు. గిరిజన నాయకుడు కాసు బాబు మాట్లాడుతూ లేటరైట్ పేరుతో పర్యావరణ ముప్పు  కలిగిస్తున్నారని వేలాది చెట్లు తొలగించారని 2009లో గ్రామ సభ తీర్మానం తో 2021 నుంచి 2041 వరకు లీజుకు ఎలా అనుమతిస్తారు అని ప్రశ్నించారు? గిరిజన నాయకుడు నూకరాజు మాట్లాడుతూ బమిడికాలొడ్డి  కొండపైన లేటరైట్ తరలించడానికి సుమారు ఆరు కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణం చేశారని ఆ రహదారి నిర్మాణం లో నేల కూలిన చెట్లు ఆనవాలు లేకుండా రాత్రి రాత్రి మీద తరలించారని అన్నారు. భారీ వృక్షాలతో నిండుగా ఉండే ఈ ప్రాంతం లేటరైట్ తవ్వకాలతో కనుమరుగవుతుందని మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయం గూర్చి రెవెన్యూ అధికారులు అటవీశాఖ అధికారులు మైనింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి లేటరైట్ తవ్వకాలను నిలిపివేయాలని లేనిపక్షంలో మా జనసేన అధినేత దృష్టికి తీసుకుని వెళ్లి అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని రప్పించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వూడి చక్రవర్తి, వెంకటరమణ, పోతురాజు,  వేగిశెట్టి శ్రీను మరియు అస నగిరి సింధూరపు కోట సిరిపురం గిరిజన గ్రామాల ప్రజలు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way