గుంటూరు ( జనస్వరం ) : అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని ప్రజాకంఠక పాలనతో ఆరు కోట్ల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ సరిదిద్దుకోలేని తప్పుల్ని చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఏ దేవుడూ క్షమించడని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆదివారం 16 వ డివిజన్ పరిధిలోని ఏటుకూరు గ్రామంలో జగనన్న కాలనీలను జనసేన పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. డివిజన్ కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేరేళ్ళ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే పేదల్ని ఇంతగా దగా చేసిన రాజకీయ నాయకున్ని చూడలేదని భవిష్యత్ లో కూడా చూడలేమని జగన్ రెడ్డి పాలనపై విరుచుకుపడ్డారు. పేదల పేరుతో వేల కోట్లు దోచుకున్న అధికార పార్టీ నేతలకు పేదల ఉసురు తగలకుండా ఉండదన్నారు. ఆకాశానికైనా ఒక హద్దు అనేది ఉంటుందని వైసీపీ నేతల అవినీతికి మాత్రం హద్దు ఆపూ ఏమి లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మాయమాటలు నమ్మి ఈ సారి కూడా వైసీపీకి ఓటు వేస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తంగా అమ్మేస్తాడని నేరేళ్ళ సురేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో నీళ్లు , బురద తప్ప ఇల్లు లేవన్నారు. గత సంవత్సరం ఏ స్థాయిలో నిర్మాణాలు ఉన్నాయో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయని ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉండే ఈ ఎనిమిది నెలల కాలంలో పేదలకు ఎలా ఇల్లు నిర్మించి ఇస్తారని ప్రశ్నించారు. పశువులకు , అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన జగనన్న కాలనీలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధప్రాతిపదికన ఇళ్లను నిర్మించాలని కోరారు. లేనిపక్షంలో జనసేన పార్టీ పేదల పక్షాన పోరాడుతుందని వడ్రాణం మార్కండేయ బాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి , ఉపాధ్యక్షురాలు బిట్రకుంట మల్లిక , గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, రాష్ట్ర రెల్లి సంఘం నాయకులు సోమి ఉదయ్, గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, యడ్ల నాగమల్లేశ్వరరావు, కటకం శెట్టి విజయలక్ష్మి,, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టీ ఉదయ్, కార్యదర్శులు బండారు రవీంద్ర, పావులూరి కోటేశ్వరరావు, తోట కార్తీక్,పులిగడ్డ గోపి, మాదాసు మాధవ, తిరుమలశెట్టి కిట్టు, మహంకాళి శ్రీనివాసరావు, మిద్దె నాగరాజు,దాసరి వెంకటేశ్వరరావు , మధులాల్, కాపు సంక్షేమ సేన గుంటూరు జిల్లా కార్యదర్శి ప్రతివాడ గంగాధరరావు, కోమ్మా వాసు,దాసరి వాసు, శివాలశెట్టీ శ్రీనివాసరావు,జిడుగు నాగయ్య,దాది ఆంజి, అములోతు నాగరాజు, కవలాశ్రీను,వీరమహిళలు శ్రీమతి పాకనాటి రమాదేవి, నిశ్శంకరరావు అనసూయ, జంజనం మల్లేశ్వరి, మేకల సాంభ్రాజ్యం హరిసుందరి, ఆసియా, ఆషా,రాజనాల నాగలక్ష్మి, ఆరుణ, బడే నాగేశ్వరరావు, పవన్ వెంకి, సంజీవ్ వివిధ డివిజన్ల అధ్యక్షులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com