Search
Close this search box.
Search
Close this search box.

కట్టడానికి నిధులు లేవు – కట్టిన వాటికి దిక్కులేదు

నిధులు

    ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణానికి వెలుపల ఐదు సంవత్సరాల క్రితం పౌర సరఫరాల శాఖ రెండు గోదాములను నిర్మించింది. ఒక్కో గోదాము 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఐనప్పటికీ ఈ గోదాములను అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తి నిరుపయోగంగా ముళ్ళకంపలతో నిండి పోయింది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వీటిని ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని అలాగే కనీసం రైతులు పండించిన పంటకు సరైన ధర వచ్చేంతవరకు ఈ గోదాముల్లో నిలువ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించాల్సిందిగా ఉరవకొండ జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీనియర్ నాయకులు దేవేంద్ర, మల్లికార్జున, మణి, రూపేష్, బోగేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way